Do you know who is that old fox that Harish Shankar tweeted
Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో హరీష్ శంకర్ ఒకరు. ప్రస్తుతం హరీష్ శంకర్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం కూడా తెలిసిందే.
ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలను తెరకెక్కిస్తున్న ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కొద్దిరోజులు గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ సినిమాని పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా వచ్చే నెల ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియా లో హరీష్ శంకర్ చాలా యాక్టివ్ గా ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఎవరైనా ఆయన మీద కామెంట్స్ చేస్తే వెంటనే రిప్లై పెట్టేస్తూ ఉంటాడు.
ఇక మొన్నటికి మొన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయింది. అంటూ ఒక అభిమాని చేసిన హడావిడి కి హరీష్ శంకర్ గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇక దానికి తోడుగా ఇప్పుడు మరోసారి ఆయన ఒక ట్వీట్ చేశాడు. రిలీజ్ దగ్గరలో ఉంది కదా ఏది కామెంట్ చేసిన పడతాడు అనుకుంటున్నారు. ఒక ముసలి నక్క నన్ను మళ్లీ టార్గెట్ చేసింది. ఇక రేపు రిలీజ్ ఉన్న కూడా నా గురించి ఏమైనా ప్రస్తావన వస్తే నేను చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాను అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశాడు.
ఇక ఇది చూసిన చాలామంది ఆయన ఎవరి గురించి పోస్ట్ చేశాడా అని ఆలోచిస్తున్నారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది జర్నలిస్టుల గురించే ఆయన ఇలాంటి పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ముసలి వాళ్లు ఎవరు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…