Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆధునిక కాలంలో నయా నియంత. తనకు నచ్చని వారిని.. తన మాటకు ఎదురు చెప్పే వారిని.. తన అధికారానికి ఎదురు వచ్చే వారిని.. ఇలా ఎవరినీ కిమ్ వదిలిపెట్టలేదు. భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నియంత అయినప్పటికీ ప్రాణభయం అధికంగా ఉండే కిమ్ .. స్వీయ జాగ్రత్తలు అధికంగా పాటిస్తుంటాడు. గాలిలో ప్రయాణించడు. ప్రత్యేకమైన రైలులో మాత్రమే అతడు ప్రయాణిస్తుంటాడు. చివరికి తన సంబంధించిన ఏ వస్తువును కూడా వదిలిపెట్టడు. తన వ్యర్ధాన్ని కూడా వెంట తీసుకెళ్తాడు.
Also Read: మోదీ తల్లితో కాంగ్రెస్ ‘రాజకీయం’.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
ఉత్తరకొరియాలో కిమ్ చెప్పిందే వేదం. కిమ్ చెప్పిందే రాజ్యాంగం. ఆయన సూచించిన విధంగానే దేశ ప్రజలు క్షవరం చేయించుకోవాలి. ఆయన చెప్పిన తిండిని మాత్రమే. ఇంటర్నెట్ ఉండదు. టీవీలలో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతుంటాయి. ప్రతి ఇంట్లో కిమ్ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఉరి శిక్ష విధించడానికి కూడా వెనుకాడరు. తన శత్రువులను.. ప్రత్యర్థులను కిమ్ ఇప్పటికే రకరకాలుగా అంతం చేశాడు. శత్రు శేషం లేకుండా చూసుకున్నాడు. అయితే అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లే కిమ్ తనదైన ప్రత్యేకతను చూపిస్తుంటాడు. ప్రత్యేకమైన రైలులో మాత్రమే విదేశాలకు వెళ్తుంటాడు. ఆ రైలు లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పైగా ఆ రైలు అత్యంత విలాసవంతమైనది.
నియంతగా ఉన్న కిమ్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాల ప్రకారం కిమ్ ఉత్తర కొరియాలోని పంట పొలాలను పరిశీలిస్తున్నారు. పండ్ల తోటలను.. ఇతర పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అధికారులకు సూచనలు చేస్తున్నారు. పంటలు ఎలా పండించాలో.. దేశ ప్రజల ఆకలి తీర్చే విధంగా ఉత్పత్తి ఎలా పెంచాలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కిమ్ మారిపోయాడని.. ఇదంతా విధి వైపరీత్యమని కామెంట్లు చేస్తున్నారు.
Supreme Leader Kim Jong Un , knee-deep in his nation’s fields, personally inspecting the crops pic.twitter.com/ftqmXXpkPN
— Leandro Romão (@leandroOnX) September 11, 2025