Kim Jong un : అతడు ధరించిన దుస్తులను దేశ ప్రజలు ధరించాలి. అతడు ఎలాంటి హెయిర్ కట్ చేసుకుంటే.. అలాంటి స్టైల్ ను దేశ ప్రజలు అనుసరించాలి. వారంలో ఏడు రోజులపాటు పనిచేయాలి. అవసరమైతే రెండు పూటల మాత్రమే తినాలి. అధ్యక్షులవారు రమ్మని పిలిస్తే ఆడవాళ్లు పోలోమని వెళ్లాలి. ఆయనకు పడక సుఖం అందించాలి. ప్రజల ఇంట్లో అధ్యక్షుడు లేదా ఆయన తండ్రి ఫోటోలు మాత్రమే ఉండాలి. దేశంలో ఇంటర్నెట్ ఒక పరిమితికి మించే వాడాలి. ప్రభుత్వ చానల్స్ మాత్రమే చూడాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. వెనుకటి కాలంలో హిట్లర్ నియంతృత్వాన్ని ఈ ప్రపంచం చవిచూసింది. ముఖ్యంగా జర్మనీ అతడి ఏకపక్ష పోకడల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మరో హిట్లర్ ను ప్రపంచం కిమ్ రూపంలో చూస్తోంది. ఆకృత్యాలకు, అన్యాయాలకు, దారుణాతీదారుణాలకు కిమ్ పెట్టింది పేరు. ఇతడి గురించి.. ఉత్తర కొరియా దేశంలో అతడు చేస్తున్న ఆగడాల గురించి ప్రతిరోజు మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ ఉత్తరకొరియా నియంత గురించి ఒక వార్తగా చక్కర్లు కొడుతోంది.
అధికారం కోసం
అధికారం కోసం ఎలాంటి దారుణాల కైనా పాల్పడిన నీచ చరిత్ర కిమ్ ది. తన పీఠాన్ని కాపాడుకొనడం కోసం సొంత బాబాయ్ ని చంపించాడు. చెల్లెలి భర్తను మాయం చేశాడు. చెల్లెల్ని పై లోకానికి పంపించాడు. బంధువులతో ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి, విష ప్రయోగం ద్వారా వారిని అంతమొందించాడు. ఒక రకంగా చెప్పాలంటే తన నీడను కూడా కిమ్ నమ్మడు. విదేశాలకు వెళ్తే ప్రత్యేకమైన రైలు ద్వారానే ప్రయాణ సాగిస్తాడు. అందులో ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఎక్కడా కూడా ఆ రైలును ఆపడు. విదేశాలలో పర్యటించినప్పుడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడు. తన వెంట తెచ్చుకున్న పాకశాస్త్ర నిపుణులు వండిన ఆహారాన్ని మాత్రమే తింటాడు. అలాంటి కిమ్.. తన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సరికొత్త చర్యలకు పాల్పడ్డాడు.. గతంలో తన సవతి తల్లి కుమారుడిపై విష ప్రయోగం చేయించి.. అతడిని అంతమొందించిన కిమ్.. తన నానమ్మ పై కోపం వ్యక్తం చేశాడు. ఆమెకు సంబంధించిన అతి పెద్ద భవనాన్ని పడగొట్టించాడు..
ఉత్తర కొరియాలోని కిమ్ ఇల్ సాంగ్ మొదటి భార్య కుమారుడి వారసుడే కిమ్. ఇల్ సంగ్ మొదటి భార్య చనిపోయింది. దీంతో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా కూడా అతనికి పిల్లలు కలిగారు. దీంతో వారికి ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఇల్ సంగ్ ఏర్పాట్లు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనివల్ల రాజకుటుంబంలో గొడవలు ముదిరాయని తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుత కిమ్ తండ్రి జోంగ్ ఇల్ తన సవతి తల్లిని నటినేటి ఫోర్లో హాఫ్ జాంగ్ ప్యాలెస్ అనే భవనంలో నిర్బంధించాడు. అప్పటికి ఇల్ సంగ్ కాలం చేశాడు.. ఇది ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ – ప్యాంగ్ సంగ్ మధ్యలో ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో 11 హెక్టర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది.. పైగా అక్కడ హాఫ్ జాంగ్ నది ప్రవహిస్తోంది. అప్పట్లో అక్కడ ప్రత్యేక భద్రత సిబ్బంది, ఇతర ఉద్యోగులు పనిచేసేవారు.
ఇక ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ తండ్రి తన సవతి తల్లి కుమారుడు కిమ్ గ్యాంగ్ ఇల్ ను దౌత్య బాధ్యతలపై ఇతర ప్రాంతానికి పంపించాడు. అంతే తన సవతి తల్లికి ఏమాత్రం హాని తలపెట్టలేదు. 2014లో ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ తండ్రి చనిపోయాడు. ఇక తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నానమ్మ ఉంటున్న ప్యాలెస్ ను పడగొట్టించాడు. ఉపగ్రహ చిత్రాల్లోనూ కనిపించకుండా ఆ భవనాన్ని అత్యంత అధునాతనమైన యంత్రాల సహాయంతో పడగొట్టించాడు. ఆ తర్వాత చదును చేయించాడు. గతంలో ఉత్తరకొరియాలో ఆదేశ ఉన్నత అధికారుల భవనాలను కూడా కిమ్ ఇలాగే పడగొట్టించాడు.. అయితే ఈ భవనాలను ఎందుకు పడగొట్టించారు? ఉన్నట్టుండి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More