Ram Charan : క్రిస్మస్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రైస్తవులకు క్రిస్మస్ చాలా ముఖ్యమైన పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ఒకటి. క్రిస్మస్ సందర్భంగా, క్రైస్తవులు తమ ఇళ్ల ముందు నక్షత్రాలను వేలాడదీయడం, క్రిస్మస్ ట్రీలను ఉంచడం, వాటిని లైట్లతో అందంగా అలంకరించడం చూస్తుంటాం. ఈ క్రిస్మస్ చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఉంచడం చాలా మంచిది, ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తెస్తుంది. దీనివల్ల ఇంటికి ఆనందం, శాంతి కలుగుతాయి. క్రిస్మస్ చెట్టును ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతారు. క్రిస్మస్ చెట్టు ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యులు కలిసి ఇంటిని అలంకరించుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవని నమ్ముతారు.
మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో కూడా క్రిస్మస్ పండగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా రామ్ చరణ్ ఇంట్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఫోటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇందులో తన భార్య ఉపాసన కూడా ఉన్నారు. వారితో పాటు వారు పెంచుకునే కొన్ని కుక్కలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఉపాసనకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. అలాగే రామ్ చరణ్ కు కూడా. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మెగా పవర్ స్టార్ దంపతులు. ఇప్పుడు వాటితోనే క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం టాలీవుడ్ లోని సెలబ్రిటీలతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఈ సారి రామ్ చరణ్ దంపతులు ఒక్కరే కనిపించారు.
గతేడాది క్రిస్మస్ వేడుకల్లో మెగా హీరోలంతా కనిపించారు. నిహారిక నుంచి మొదలుకుని కొత్త జంట అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అల్లు శిరీష్, అల్లు బాబీ, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇలా అందరూ కలిసి క్రిస్మస్‌ను బాగానే సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు అందరి కంటే ఎక్కువగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌లే హైలెట్ అయ్యారు. ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పోజులు ఇవ్వడంతో ఈ ఫోటో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఫోటోలను ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు చరణ్ ఫ్యాన్స్ అప్పుడు తెగ షేర్ చేశారు. మరి ఈ సారి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కాస్త దూరంగా కూడా పెరిగిందని ప్రచారం జరుగుతుంది. దీంతో రెండు ఫ్యామిలీలు కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం డౌటే.
ఇక రామ్ చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో అట్టహాసంగా జరిగింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10వ తేదీన సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో , ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Its christmas at ram charans house there are also some dogs that are raised around
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com