Vijay Deverakonda-Rashmika : చాలా కాలం నుండి మీడియా లో హాట్ టాపిక్ గా చలామణి అవుతున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘గీత గోవిందం’ చిత్రంలో హీరో హీరోయిన్లు గా వీళ్లిద్దరు నటించారు. కానీ ఈ సినిమాకి ముందే వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడిందనే విషయం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ద్వారా తెలిసింది. ‘అన్ స్టాపబుల్’ షోకి ‘ఎనిమల్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన రష్మిక తో కలిసి వచ్చాడు. రష్మిక గురించి సీక్రెట్స్ చెప్తూ, నేను ‘అర్జున్ రెడ్డి’ మూవీ సక్సెస్ పార్టీ కి వెళ్లానని, అక్కడ విజయ్ దేవరకొండ తో రష్మిక ని చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు. విషయం బయటపడేలోపు ఇది చెప్పడం ఇప్పుడు అంత అవసరమా అని రష్మిక చిర్రుబుర్రులాడుతుంది.
వీళ్లిద్దరి మధ్య అప్పటి నుండి స్నేహం ఉంది. ‘గీత గోవిందం’ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. అప్పటి నుండి వీళ్ళు కలిసి తిరగడాలు వంటివి మనం ఎదో ఒక సందర్భంలో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ కూడా వీళ్లిద్దరు ఇప్పటికీ తమ రిలేషన్ విషయం లో బయటపడడం లేదు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. ఈ జనరేషన్ జనాలు ఆవలిస్తే వారం రోజుల క్రితం ఏమి తిన్నావో చెప్పేసే రకం, వాళ్ళ ముందు ఇలాంటి కబుర్లు ఎందుకు చెప్పేది అంటూ పలువురు విశ్లేషకులు వీళ్లిద్దరి పై సెటైర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే వీళ్లిద్దరు ముంబై విమానాశ్రయం లో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా విమానాశ్రయానికి రష్మిక చేరుకోగా, ఆ తర్వాత కాసేపటికి ఆమె వద్దకు విజయ్ దేవరకొండ వస్తాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం వీళ్లిద్దరు ముంబై కి వచ్చినట్టు తెలుస్తుంది. ముంబై లో వీళ్లిద్దరికీ స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా రణబీర్ కపూర్ ఫ్యామిలీ తో వీళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు. ఎప్పుడు ముంబై కి వెళ్లినా వీళ్ళు రణబీర్ కపూర్ ఇంట్లోనే ఉంటారట. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీళ్లంతా కలిసి సంబరాలు చేసుకోనున్నారు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ గా ఉంది.. మరో పక్క వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.