Trump tariff powers stripped: అమెరికా ఫస్ట్.. గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదాలతో అమెరికన్లను ఆకట్టుకుని.. రెండోసారి అధికారంలోకి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన బాధ్యతలు చేపట్టి పది నెలలైంది. కానీ అమెరికన్లు, అమెరికాలోని విదేశీయులు, ప్రపంచ దేశాలు.. పది నెలల పాలను పదేళ్ల భారంగా భావిస్తున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ చేస్తున్న అరాచకాలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. నచ్చిన దేశాలపై తక్కువ.. మాట వినని దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు(టారిఫ్‌లు) విధించారు. టారిఫ్‌ల అంశం తన పరిధిలో లేకపోయినా ఏకపక్షంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసి అమలు చేస్తున్నారు. అయితే ట్రంప్ దూకుడుకు సెనేట్ బ్రేక్ వేసింది. అంతర్జాతీయ టారిఫ్‌లను సెనేట్ గట్టిగా వ్యతిరేకించింది. 51–47 ఓట్లతో టారిఫ్‌ను ఓడించింది. దీంతో వాణిజ్య యుద్ధాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఇది రెండు పార్టీల సమ్మతితో జరిగిన మొదటి పెద్ద విజయం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తోంది.
టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఏకైమన రెండు పార్టీలు..
సెనేట్‌లో డెమోక్రట్లు ప్రధానంగా మద్దతు ఇచ్చినప్పటికీ, నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు కీలకంగా మలుపు తిప్పారు. ఈ వారం ముందు బ్రెజిల్, కెనడా టారిఫ్‌లపై కూడా సారూప్య ఓట్లు జరిగాయి. ఈ ఘటనలు ట్రంప్ విధానాలకు సవాల్‌గా మారాయి. ఆర్థిక నిపుణులు ధరల పెరుగుదలను నివారించే అవకాశంగా చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ అధికారాలను పునరుద్ధరించే సంకేతం.
వ్యాపారాలకు ఉపశమనం
టారిఫ్‌లు రద్దు కావడంతో దిగుమతులు సులభతరమవుతాయి. ఉత్పత్తి ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా. ఇది ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో లాభాలను పెంచుతుంది. అయితే, దేశీయ ఉత్పాదకులకు సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విదేశీ పోటీ తీవ్రమవుతుంది. మొత్తంగా, ఈ మార్పు జీడీపీ పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్..
సెనేట్ నిర్ణయం ట్రంప్ పాలనకు పెద్ద దెబ్బ. రిపబ్లికన్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. 2026లో జరిగే ఎన్నికలపై ఇవి ప్రభావం చూపుతాయి. ట్రంప్ ఈ చర్యలను ‘అత్యవసరం‘గా ప్రకటించినా, సెనేట్ దాన్ని ప్రతిపక్షం చేసింది. ఇది అధ్యక్ష అధికారాలను పరిమితం చేసే చట్టాల చర్చను రేకెత్తిస్తుంది. దీంతో ఇకపై ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని సెనేట్ స్పష్టం చేసింది. ఈ బిల్లు ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో చర్చకు వస్తుంది, అక్కడ కూడా బైపార్టిసన్ మద్దతు ఉండవచ్చు. దీంతో అంతర్జాతీయంగా, చైనా, యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు మెరుగుపడతాయి, వాణిజ్య ఒప్పందాలు త్వరగా ఏర్పడతాయి. ట్రంప్ ప్రతిస్పందన ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.
BREAKING: The U.S. Senate just voted 51-47 to END ALL of President Donald Trump’s global tariffs.
This is getting OUT OF HAND.
pic.twitter.com/FqTyhr9CfW— Jack (@jackunheard) October 30, 2025