Modi warning to Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత సీజ్‌ఫైర్‌పై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై పార్లమెంటు వేదికగా స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. మళ్లీ చాలాకాలం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత ఎయిర్ చీఫ్ మార్షన్, సైనిక అధికారి, కేంద్ర రక్షణ మంత్రి మాత్రమే ప్రకటనలు చేశారు. మోదీ మౌనంగా ఉన్నారు. తాజాగా కూడా రక్షణ మంత్రి, సైనికాధికారి పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో మన శక్తి ఏమిటో తెలియాల్సిన వాళ్లకు తెలిసిందని వెల్లడించారు. మన శక్తిని ప్రపంచ మొత్తం చూసింది అని పేర్కొన్నారు.
ఐక్యతకు నిలువెత్తు రూపం..
స్వాతంత్య్రం అనంతరం దేశంలో 550కు పైగా సంస్థానాలు, రాజ్యాలను సర్దార్ పటేల్ తన రాజకీయ మేధస్సుతో, సంయమనంతో కేంద్ర పాలనలో విలీనం చేశారని మోదీ ప్రశంసించారు. దేశాన్ని ఏకం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తప్పిదంతోనే కశ్మీర్ ఆక్రమణ..
కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో కలిపేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ అనుమతి ఇవ్వలేదని మోదీ వ్యాఖ్యానించారు. పటేల్ కఠినంగా వ్యవహరించిన హైదరాబాదు, జునాగఢ్‌లను కూడా భారతంలో కలిపారు. కశ్మీర్ విషయంలో మాత్రం నిర్ణయం అతనికి దూరంగా ఉండిపోయిందని వెల్లడించారు. ఇది దేశానికి చరిత్రలో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పుగా మిగిలిపోయిందని తెలిపారు.
దేశ సమగ్రతకు నూతన సందేశం
ఈ సందర్భంలో ఐక్యతను ప్రతిబింబించేలా గుజరాత్‌లోని స్టాచూ ఆఫ్ లిబర్టీ వద్ద నిర్వహించిన ప్రత్యేక పరేడ్, సైనిక కవాతు ఎంతో ఆకట్టుకుంది. పటేల్ దృష్టిలో ’ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ పథకం ఎంతో ప్రాధాన్యత పొందింది. నక్సలిజం, రెడికల్ శక్తులకు దేశ సమగ్రత కోసం పోరాటం సాగించాల్సిన అవసరాన్ని మోదీ స్పష్టం చేశారు. అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టే దిశగా, దేశమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
చరిత్రను సృష్టించాలి..
కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. ఆ పార్టీ చరిత్రను రాసిందని, సృష్టించలేదని పేర్కొన్నారు. పంచాయితీ, రాజకీయ వ్యవస్ధా, దేశంలోని నాయకత్వాన్ని అవమానించిన కాంగ్రెస్ తీరు సర్దార్ పటేల్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని విమర్శించారు. చరిత్ర రాసేది కాదని సృష్టించాలని తెలిపారు.