Child Scheme in China: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు.. ఒకప్పుడు సరైన స్థాయిలో ఆహార ధాన్యాలు ఉండేవి కాదు. తిండి గింజలు లభించేవి కావు.. దీంతో జనాభాను తగ్గించడానికి అన్ని దేశాలు పథకాలను ప్రవేశపెట్టాయి. కుటుంబ నియంత్రణను అమలు చేశాయి. తద్వారా జనాభా తగ్గింది. అయితే ఇటీవల కాలంలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా అన్ని దేశాలలో జనాభా తిరో గమనంలో ఉంది. ఈ జాబితాలో ఒకప్పుడు ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా కూడా ఉంది. చైనాలో బలవంతమైన కుటుంబ నియంత్రణ ను అమలు చేశారు. ఫలితంగా జనాభా తగ్గిపోయింది. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. పైగా ఆ దేశంలో యువత సంఖ్య తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. యువత సంఖ్య తగ్గిపోవడంతో చేసేవారి సంఖ్య పడిపోతుంది. యువత జనాభా తగ్గిపోవడంతో వస్తువుల ఉత్పత్తి కూడా నేల చూపు చూస్తోంది. అంతిమంగా అది ఆ దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తోంది.
జనాభా ఇంకా నేలచూపులు చూడకముందే చైనా ప్రభుత్వం మేల్కొంది. ఇందులో భాగంగానే జనాభా సంక్షోభాన్ని అధిగమించడానికి చైనా ఒక స్కీం ప్రవేశపెట్టింది. ఈ స్కీం ప్రకారం ఒక బిడ్డను కంటే సంవత్సరానికి 3,600 యువాన్లు ఇవ్వనుంది. ఇది మన దేశ కరెన్సీలో 43000. మూడు సంవత్సరాల పాటు ఇలాగే అక్కడి ప్రభుత్వం రివార్డు ఇస్తుంది. ఇక చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఇప్పటికే రెండవ బిడ్డకు జన్మనిస్తే 6 లక్షలు.. మూడవ బిడ్డకు జన్మనిస్తే 12 లక్షలు ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఇస్తున్నారు.
Also Read: ఒకరికి తెలియకుండా మరొకరితో.. ఏకంగా ఆరుగురు.. చివరికి ఈ అమ్మాయి బండారం ఇలా బయటపడింది!
చైనా దేశంలో గత కొంతకాలంగా వివాహాలు చేసుకునే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఒక పట్లగా యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. ఉద్యోగాలు లభించకపోవడం వల్ల చాలామంది యువకులు వివాహాలకు దూరంగా ఉంటున్నారు. వైవాహిక జీవితంలో ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల కూడా చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దీంతో చైనా దేశంలో జనాభా తగ్గిపోతుంది. ఒకప్పుడు ప్రపంచంలో జనాభా విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనా.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోవడం అక్కడ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే మరింత దారుణంగా ఉంటుందని భావించిన అక్కడి పరిపాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా జనాభా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పథకం అక్కడ సత్ఫలితాలను ఇస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
Also Read: పాస్ పోర్ట్, వీసా అవసరం లేకుండా ఈ దేశానికి సులభంగా వెళ్లవచ్చు. ఆధార్ ఉంటే చాలు..
మరోవైపు చైనాలో ఇటీవల కాలంలో ఉద్యోగాల లభ్యత కూడా పూర్తిగా తగ్గింది. ఉద్యోగాలు లభించకపోవడంతో యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగులకు ఆడపిల్లలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో చాలామంది యువకులు బ్రహ్మచారులు గానే మిగిలిపోతున్నారు. ఇది కూడా జనాభా సంక్షోభానికి ఒక కారణమని చైనా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల లభ్యత పెంచితేనే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.