Bangladesh Viral Video: నేటి కాలంలో ప్రతిదీ ఇన్ స్టంట్ గానే ఉంది. మనుషుల మధ్య బంధాలు బలంగా ఉండడం లేదు. ఆప్యాయతలు దృఢంగా ఉండడం లేదు. బంధుత్వాలు స్థిరంగా కనిపించడం లేదు. ఎటు చూసినా స్వార్థం మాత్రమే రాజ్యమేలుతోంది. చివరికి ప్రేమ విషయంలో కూడా అలానే జరుగుతోంది. నేటి కాలంలో రిలేషన్లు త్వరగానే అంతమవుతున్నాయి. మఘ లో పుట్టి పుబలో అంతమవుతున్నాయి. అంతేకాదు మల్టీ రిలేషన్లను కొనసాగించడం నేటి కాలం యువత ఒక ప్యాషన్ గా భావిస్తోంది. అంతేకాదు తమ స్నేహితుల ముందు ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నది. ఇందులో మగ ఆడ అని తేడా లేకుండా ఉన్నది. తాజాగా ఓ యువతి ఉదంతం ఇలా వెలుగులోకి వచ్చింది.
ఆ యువతి స్థానికంగా ఉన్న ఒక కళాశాలలో చదువుతోంది. చూసేందుకు బొద్దుగా ముద్దుగా ఉంటుంది. అయితే ఈమెకి అబ్బాయిలతో స్నేహం చేయడం చాలా ఇష్టం. అంతవరకు బాగానే ఉంటే సరిపోయేది. అని అది పరిధి దాటిపోయింది.
ఆ యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగించడం మొదలుపెట్టింది. ఇలా ఏకకాలంలో ఆరుగురితో రిలేషన్ కొనసాగిస్తోంది. కొద్దిరోజులుగా ఆ అమ్మాయికి సాగించిన వ్యవహారం నిరాటంకంగా కొనసాగింది. అయితే ఇందులో ఆరో యువకుడికి ఎందుకో అనుమానం కలిగింది. ఆమె ఫోన్ నిత్యం బిజీ రావడం… ముక్తసరిగా మాట్లాడటం ఎందుకో అతడికి తేడాగా అనిపించింది. వెంటనే కూపీ లాగాడు. ఆమె వ్యవహార శైలిని పరిశీలించడం మొదలుపెట్టాడు. దీంతో అమ్మగారి బండారం ఒక్కసారిగా బయటపడింది. వెంటనే రంగంలోకి దిగి.. ఆమె రిలేషన్ కొనసాగిస్తున్న ఐదుగురు వ్యక్తులను కలిశాడు. వారి నెంబర్లను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతి చేస్తున్న మోసాన్ని వివరించాడు. చివరికి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఆరో యువకుడు ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ యువతిని హోటల్ కు రమ్మన్నాడు. అక్కడ కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు కాఫీ తాగుతుండగా.. నీకో సర్ప్రైజ్ అంటూ ఆ అమ్మాయికి చెప్పాడు. అది నువ్వు చూడాలంటే కళ్ళు మూసుకోవాలని అన్నాడు. అదేవిధంగా ఆమె కళ్ళు మూశాడు. మిగతా ఐదుగురు యువకులను రమ్మని చెప్పాడు. వారు కూడా అతడు చెప్పినట్టు చేశారు. ఈలోగా ఆమె కళ్ళు తెరిచాడు. అంతే ఒక్కసారిగా ఆ అమ్మాయి షాక్ కు గురైంది.
బంగ్లాదేశ్ లోని డాకా నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. డాకా నగరంలోని ఓ కాలేజీలో చదువుతున్న యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగించడం మొదలుపెట్టింది. ఏకకాలంలో ఆరుగురు అబ్బాయిలతో వ్యవహారం కొనసాగిస్తోంది. చివరికి ఆరో యువకుడు ఆమె బండారం బయటపెట్టాడు. అంతేకాదు ఈ వ్యవహారం మొత్తాన్ని అతడు రహస్యంగా వీడియో తీయించాడు. అది సోషల్ మీడియాకు ఎక్కడంతో సంచలనం సృష్టిస్తోంది.
View this post on Instagram