Vangaveeti Mohan Ranga: ప్రముఖులు, దేశ నాయకుల జయంతులు, వర్ధంతుల నాడు నివాళి అర్పించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. అందునా సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల సంతాపాల విషయంలో నేతలతో పాటు ప్రజాప్రతినిధులు ముందుంటారు. వారి సేవలను గుర్తుచేస్తూ కొనియాడుతుంటారు. నిన్ననే స్వామి వివేకానంద( Swami Vivekanand), జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, మాజీ సీఎం రోశయ్యల వర్ధంతి దినాలు. అలాగే అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహన్ రంగ జయంతి. దీంతో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ ఘన నివాళులు అర్పించారు. కానీ ఒక్క వంగవీటి మోహన్ రంగా విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం. అయితే మోహన్ రంగా నివాళులు అర్పించే విషయంలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించి అలా చేసి ఉంటారన్న అనుమానం ఉంది.
Also Read: టీడీపీ.. చంద్రబాబు.. పవన్ లో అదే భయం భక్తి..
టిడిపిలో వారసుడు..
ప్రస్తుతం వంగవీటి మోహన్ రంగా( vangaveeti Mohan Ranga ) కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవిస్తారని ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ సానుకూలంగా ఉంటారు. గతంలో చంద్రబాబు స్వయంగా వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. మొన్నటికి మొన్న రాధాను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా పరామర్శించారు. అనారోగ్యంతో రాధాకృష్ణ బాధపడుతుంటే విషయం తెలుసుకున్న లోకేష్ స్వయంగా పరామర్శించడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి రాధాకృష్ణ తండ్రి మోహన్ రంగా జయంతి నాడు నివాళులు అర్పించకపోవడం ఏమిటనే ప్రశ్నా వినిపిస్తోంది.
Also Read: టిడిపి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. మధ్యలో మాజీ మంత్రి.. ఆ జిల్లాలో బిగ్ ఫైట్!
నిగ్గు తేల్చలేకపోయిన కాంగ్రెస్ సర్కార్
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతగా ఉన్న వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఓ సామాజిక వర్గం పైనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వంగవీటి మోహన్ రంగా హత్యతో ఒక సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు సంబంధించి అటు తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అప్పటివరకు తెలుగుదేశం పార్టీపై ఉన్న అనుమానాలు.. కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొంతవరకు టర్న్ అయ్యాయి. అయితే ఎక్కువగా విమర్శలకు గురైంది మాత్రం తెలుగుదేశం పార్టీ. అయితే వంగవీటి రాధా అనూహ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తొలుత కాంగ్రెస్.. తర్వాత ప్రజారాజ్యం.. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు వంగవీటి రాధాకృష్ణ. ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తండ్రిని హత్య చేసిన పార్టీలోకి వెళ్తావా అంటూ ప్రత్యర్థులు విమర్శలు కూడా చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు రాధా. అయితే ఇప్పుడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగా కు నివాళులు అర్పించకపోవడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది.