Homeఅంతర్జాతీయంPakistan new conspiracy against India: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత కూడా మారని పాకిస్తాన్‌.. భారత్‌పై...

Pakistan new conspiracy against India: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత కూడా మారని పాకిస్తాన్‌.. భారత్‌పై మరో కుట్ర..

Pakistan new conspiracy against India: ఒకవైపు ఇరాన్, గల్ఫ్‌ యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధం చేస్తోంది. ఈ సమయంలోనే భారత్‌పై దాడికి కుట్ర చేస్తోంది. ఇటీవల ఒక వీడియో మన ఇంటలిజెన్స్‌ అధికారులకు దొరికింది. ఇందులో లష్కర్‌ ఎ తోయిబాకు చెందిన కీలక నాయకుడు హారిస్‌ ధర్‌ ఉగ్రవాదులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లకు నీళ్లలో ఎలా ప్రయాణం చేయాలి. అండర్‌ వాటర్‌లో ఎలా ప్రయాణం చేయాలో ట్రెయినింగ్‌ ఇస్తున్నాడు. ఇందులో కీలక […]

Pakistan new conspiracy against India: ఒకవైపు ఇరాన్, గల్ఫ్‌ యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధం చేస్తోంది. ఈ సమయంలోనే భారత్‌పై దాడికి కుట్ర చేస్తోంది. ఇటీవల ఒక వీడియో మన ఇంటలిజెన్స్‌ అధికారులకు దొరికింది. ఇందులో లష్కర్‌ ఎ తోయిబాకు చెందిన కీలక నాయకుడు హారిస్‌ ధర్‌ ఉగ్రవాదులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లకు నీళ్లలో ఎలా ప్రయాణం చేయాలి. అండర్‌ వాటర్‌లో ఎలా ప్రయాణం చేయాలో ట్రెయినింగ్‌ ఇస్తున్నాడు. ఇందులో కీలక నాయకుడు రిజ్వాన్‌ హానిఫ్, హామీద్‌ జియా కూడా ఉన్నట్లు మన ఇంటలిజెన్స్‌ గుర్తించింది. ఐదు వేల మందికి విక్షణ ఇస్తున్నట్లు తెలసింది. 300 మంది శిక్షణ పూర్తి చేసుకుని ఆపరేషన్‌ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో కోఆర్డినేటెడ్‌ దాడులు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు సమాచారం.

2008 ముంబై తరహా దాడులకు ప్లాన్‌?
పాక్‌ ఉగ్రవాదులు 2008లో గుజరాత్‌ తీరం నుంచి సముద్రమార్గం ద్వారా ముంబైకి చొరబడి 166 మందిని చంపి, 300 మందిని గాయపరిచారు. 9 మంది ఉగ్రులు హతమై, కసాబ్‌ మాత్రమే పట్టుబడ్డాడు. ఈ తరహా సమన్వయ దాడులు పునరావృతం చేయాలని పాక్‌ ప్రణాళిక వేస్తున్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జలమార్గం ద్వారా చొరబాట్లు..
పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లో చొరబడడం రోజు రోజుకూ కష్టంగా మారుతోంది. భారత నిఘా వ్యవస్థ పటిష్టమైంది. చీమ చిటుక్కుమన్నా సరిహద్దుల్లోనే గుర్తిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడానికి రావి, బియాస్‌ నదులు, పంజాబ్‌ కాలువలు, పటాన్‌కోట్‌ జలమార్గాల ద్వారా చొరబాటు ప్రణాళికలు ఉన్నాయని సమాచారం. భారత్‌ భూభార్గ రక్షణ బలపడటంతో ఈ మార్గాలు ఎదుగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత కూడా పాక్‌ తీరు మార్చుకోకపోవటం ఆందోళనకరం.

వ్యూహాత్మక కారణాలు
పాక్‌ ఆఫ్గాన్, ఖైబర్‌ పఖ్తూంఖ్వా, బలూచిస్తాన్‌ గొడవల నుంచి దృష్టి మళ్లించేందుకు భారత్‌పై దాడి ఎంపిక చేసిందని సమాచారం. ఇరాన్‌ యుద్ధ ఒత్తిడిలో ప్రపంచ దృష్టి మళ్లిన సమయాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ కుట్ర భారత్‌కు బహుళ–రాష్ట్ర భద్రతా సవాలుగా మారుతోంది.

పాక్‌ ఈ జల ఉగ్రవాద వ్యూహంతో 2008 దాడులను మించే నష్టం కలిగించాలని లక్ష్యం పెట్టుకుంది. భారత్‌ తీరప్రాంత, నది భద్రతను మరింత బలోపేతం చేయాలి. ఇంటెలిజెన్స్‌ పంజాబ్, గుజరాత్‌ రెండు మార్గాలపై దృష్టి పెట్టాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper