Pakistan Closer To America: ఇటీవల సౌదీ అరేబియాతో మనకు వ్యతిరేకంగా పావులు కదిపింది పాకిస్తాన్. అంతేకాదు ఆ దేశంతో మనకు హెచ్చరికలు కూడా జారీ చేయించింది. తిక్క రేగిన ఇండియా సౌదీ అరేబియాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం.. అరబ్ దేశం తోకముడిచింది. సౌదీ అరేబియాతో పని కాదని భావించిన పాకిస్తాన్.. మన దేశానికి వ్యతిరేకంగా ప్లాన్ బీ అమలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళిక రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన అసలు విషయం ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది.
ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్న కథనం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్ దేశంలో ఖనిజాలు తవ్వుకోవడానికి అమెరికా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఖనిజాలను రవాణా చేయడానికి ఏకంగా పోర్టు కట్టాలని అమెరికా ముందు పాకిస్థాన్ ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదనలను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రతినిధులు వైట్ హౌస్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.. బలుచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్ జిల్లాలోని పాస్నీ ప్రాంతంలో పోర్టు నిర్మించాలని పాకిస్తాన్ అమెరికా ముందు ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.. ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాటన్నింటినీ వెలికి తీసి అమెరికాకు రవాణా చేసేందుకు కంపెనీల ప్రతినిధులు ఆలోచిస్తున్నారు.
ఈ ప్రాంతంలో మెరుగైన రోడ్లు.. ఇతర మౌలిక వసతులు కల్పించాలని అమెరికా కంపెనీల ప్రతినిధులను మునీర్ సలహాదారులు కోరినట్టు తెలుస్తోంది. ఇటీవల మునీర్ రెండు దఫాలుగా అమెరికాలో పర్యటించారు. ఒకసారి ట్రంప్ ని కలిశారు. ఆ సమయంలో మునీర్ కు వ్యతిరేకంగా అమెరికాలో స్థిరపడిన పాకిస్తాన్ దేశస్తులు ఆందోళనలు చేశారు. మునీర్ ను చెడ్డ వ్యక్తి అని పేర్కొన్నారు. దీనికి తోడు మునీర్ ట్రంప్ తో వైట్ హౌస్ లో భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వ్యాపారాలకు సంబంధించిన చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. గతంలో ఈ ప్రతిపాదనలు చర్చల దశలో ఉండగానే.. ఆపరేషన్ సిందూర్ మొదలైంది. మునీర్ ను చల్ల పరచడం కోసం ఈ వ్యవహారంలో అమెరికా ఎంట్రీ అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని భారత్ వెలుగులోకి తెచ్చింది.
భారత్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత పాకిస్తాన్ తేలు కుట్టిన దొంగలాగా వ్యవహరించింది. పాకిస్తాన్ దేశంతో వ్యాపార లావాదేవీలు ఉండడంతో ఇటీవల కాలంలో అమెరికా అంట కాగడం మొదలుపెట్టింది. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫైనాన్షియల్ టైమ్స్ వెలుగులోకి తీసుకొచ్చిన సంచలన కథనం ద్వారా అమెరికా అసలు స్వరూపం.. పాకిస్తాన్ పన్నాగం బయటపడ్డాయి.