Naga Chaitanya Comments About Shobhita: వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి ‘తండేల్'(Tandel Movie) రూపం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ దొరికిందో మనమంతా చూసాము. కేవలం నాగ చైతన్య కి మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ కి కూడా ఈ సినిమా ఎంత ప్లస్ అయ్యింది. అంతకు ముందు అక్కినేని ఫ్యామిలీ చిత్రాలు వరుసగా సింగిల్ డిజిట్ షేర్స్ ని అందుకున్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి వీళ్ళని అభిమానిస్తూ వస్తున్న ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండుంటుందో మీరే ఊహించుకోండి. అలాంటి కష్టమైన ఫేస్ నుండి బయటకు వచ్చిన అక్కినేని ఫ్యామిలీ, ఇప్పుడు వరుసగా కుబేర, కూలీ వంటి సూపర్ హిట్ సినిమాలను చూసే పరిస్థితి కి వచ్చింది. ఇలా అక్కినేని ఫ్యామిలీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి కారణమైన ‘తండేల్’ చిత్రం వల్ల, శోభిత నాగ చైతన్య తో కొన్నాళ్ళు మాట్లాడడం ఆపేసింది అట.
రీసెంట్ గానే నాగ చైతన్య జీ తెలుగు లో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ టాక్ షోలో ఆయన ఈ విషయాన్ని జగపతి బాబు తో పంచుకున్నాడు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘తండేల్ చిత్రం లో బుజ్జి తల్లి పాట పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే నేను ఇంట్లో శోభిత ని మొదటి నుండి బుజ్జి తల్లి అని పిలుస్తుంటాను. తనని పిలిచే పేరుతో తండేల్ లో సాయి పల్లవి ని పిలవడం తో ఆమెకు చాలా కోపం వచ్చింది. నువ్వే చెప్పి పెట్టించావు కదా అని నాతో మాట్లాడడం కొన్ని రోజులు మానేసింది. కానీ నిజంగా నేను డైరెక్టర్ కి చెప్పి పెట్టించలేదు. ఆయనే సొంతంగా రాసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఇది విన్న తర్వాత ‘అబ్బో..శోభిత చాలా గట్టి అమ్మాయి లాగా ఉందే..కనిపించేంత సాఫ్ట్ కాదు’ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే వీళ్లిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైందని జగపతి బాబు అడగ్గా, సోషల్ మీడియా ద్వారానే అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. హైదరాబాద్ లోని తన రెస్టారంట్ ‘షోయూ’ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఫోటోలను మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. దానికి శోభిత లైక్స్ కొట్టడం, కామెంట్స్ చేయడం, ఎమోజీలు పెట్టడం వంటివి చేసేది. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త స్నేహం గా మారడం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం వంటివి జరిగాయి అంటూ నాగ చైతన్య ఈ టాక్ షో లో చెప్పుకొచ్చాడు.