Homeఅంతర్జాతీయంPakistan unemployment crisis: 21 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం.. పాకిస్తాన్ కుప్పకూలడం ఖాయం..!

Pakistan unemployment crisis: 21 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం.. పాకిస్తాన్ కుప్పకూలడం ఖాయం..!

Pakistan unemployment crisis: దాయాది దేశం పాకిస్తాన్‌ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టు ఆడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ నుంచి అప్పులు తెచ్చుకుంటేగాని రోజు గడవని పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఉగ్రవాదం పెంచి పోషించడంతో ప్రముఖ కంపెనీలు ఆ దేశాన్ని వీడుతున్నాయి. గతేడాది అనేక సంస్థలు పాకిస్తాన్‌ను వీడాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏమో కానీ, యువకులకు ప్రైవేటు ఉద్యోగాలు దొరకడం లేదు. తాజా అధ్యయనాలు దేశంలో నిరుద్యోగ రేటు రికార్డుస్థాయికి చేరుకుంది.

రికార్డు స్థాయి నిరుద్యోగం..
లేబర్‌ ఫోర్స్‌ సర్వే ఫలితాల ప్రకారం, నిరుద్యోగ శాతం పాకిస్తాన్‌లో 7.1కి చేరింది. గత రెండు దశాబ్దాల్లో ఇది అత్యధికం. ఏటా 30 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు సృష్టించాల్సి ఉందని వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా హెచ్చరించారు. రాబోయే 10 సంవత్సరాల్లో 3 కోట్ల ఉద్యోగాల అవసరం ఉందని అంచనా.

యువత విదేశాలబాట
అస్థిర రాజకీయాలు, భద్రతా ఆందోళనలతో నైపుణ్యం ఉన్న విద్యావంతులు దేశం వీడుతున్నారు. విదేశాలకు వెళ్తున్నారు. 2025లో 4 వేల మంది వైద్యులు దేశాన్ని వదిలిపోయారు. ఇతర వృత్తిధారులు కూడా ఇదే పరిస్థితి. పరిశ్రమలు మూతలు, పెట్టుబడుల ఉపశమనం సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.

షెహబాజ్‌ ప్రభుత్వం ఆర్థిక మార్పులు సాధించామని ప్రకటిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు లేకపోవడం, పరిశ్రమల తగ్గుదల నిరుద్యోగ సమస్యను పెంచుతోంది. ఉగ్రవాద దాడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version