https://oktelugu.com/

షాకింగ్: వికటించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. ప్రయోగాలకు బ్రేక్

ప్రపంచం మొత్తం చూపు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిపైనే.. ఇప్పటికే   వ్యాక్సిన్‌ ను తయారు చేసి రిలీజ్ చేశామని రష్యా చెబుతున్నప్పటికీ, దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆ టీకాను ఏ దేశం కూడా తీసుకోవడం లేదు. రెండు క్లినికల్ ట్రయల్స్ కే ఆ టీకా విడుదల చేయడంతో దాని పనితీరుపై అందరిలోనూ అనుమానాలున్నాయి. Also Read: డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు ప్రస్తుతం అత్యంత మెరుగైన ఫలితాలు వస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 11:51 am
    Oxford Vaccine

    Oxford Vaccine

    Follow us on

    Oxford Vaccineప్రపంచం మొత్తం చూపు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిపైనే.. ఇప్పటికే   వ్యాక్సిన్‌ ను తయారు చేసి రిలీజ్ చేశామని రష్యా చెబుతున్నప్పటికీ, దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆ టీకాను ఏ దేశం కూడా తీసుకోవడం లేదు. రెండు క్లినికల్ ట్రయల్స్ కే ఆ టీకా విడుదల చేయడంతో దాని పనితీరుపై అందరిలోనూ అనుమానాలున్నాయి.

    Also Read: డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు

    ప్రస్తుతం అత్యంత మెరుగైన ఫలితాలు వస్తున్న ఆక్స్ ఫర్డ్ టీకాపైనే అందరి దృష్టి నెలకొంది. భారత్ లో కూడా ఈ టీకా పరీక్షలు జరుగుతున్నారు. పూణేకు చెందిన  సీరం ఇన్స్టిట్యూట్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌ను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గురించి తాజా సమాచారం ప్రకారం.. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    యూకే, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో 30వేల మందిపై ఆక్స్ ఫర్డ్ టీకా మూడో దశ ప్రయోగాలు నడుస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో టీకాను ప్రయోగించడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. కానీ తాజాగా ఓ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న పలువురు వలంటీర్లకు టీకా వికటించడంతో దానిని పరిశీలిస్తున్నారు.

    అయితే ప్రపంచంలోనే అందరికీ ఆశాకిరణంలా కనిపిస్తున్న బ్రిటన్ లోని ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ‘కరోనా వ్యాక్సిన్’ ట్రయల్స్ లో షాకింగ్ ఫలితం వచ్చింది. డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందనుకుంటున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడింది.

    Also Read: కరోనా కల్లోలం..: ఇప్పట్లో వదిలేలా లేదు కదా..!

    ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెండు ట్రయల్స్ ఫుల్ సక్సెస్ అయ్యాయి. దీంతో ప్రపంచమంతా దీనిపైనే ఆశలు పెంచుకుంది కానీ తాజాగా బ్రిటన్ లో మూడో దశ ప్రయోగాల్లో వ్యాక్సిన్ వేయించుకున్న పలువురికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు సమాచారం. దీంతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను టీకా తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా ఆపేసింది. వ్యాక్సిన్ భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తయారీదారు అయిన ఆస్ట్రాజెనెకా తెలిపింది. అయితే వాక్సిన్ తయారీలో ఇలాంటి సమస్యలు వస్తాయని.. ఇలా జరిగినప్పుడు లొతైన పరిశీలన చేసి తిరిగి ప్రయోగాలను చేస్తామని తెలిపింది.