spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Tamil Nadu Election 2026: తమిళ హీరో విజయ్ పోటీ చెయ్యబోయే స్థానం ఇదే..నిజమైతే...

Vijay Tamil Nadu Election 2026: తమిళ హీరో విజయ్ పోటీ చెయ్యబోయే స్థానం ఇదే..నిజమైతే గెలుపు అసాధ్యం!

Vijay Tamil Nadu Election 2026: మరో రెండు నెలల్లో తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి తమిళనాడు ఎన్నికలపై దేశం మొత్తం ఒక కన్ను వేసింది. ఎందుకంటే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ని స్థాపించి పోటీ చేయబోతున్నాడు. నేటి తరానికి చెందిన సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరి ఫోకస్ ఆయన పార్టీ పై ఉంటుంది, ఆ పార్టీ పోటీ చేస్తున్న రాష్ట్రము పై కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు విజయ్ ఎక్కడి నుండి పోటీ చెయ్యబోతున్నాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు మూడు ప్రాంతాలను ఆయన పరిగణలోకి తీసుకున్నాడట. అందులో మొదటి ఛాయస్ గా పెరంబూర్ స్థానం ఉందట. దాదాపుగా విజయ్ ఈ ప్రాంతం నుండే పోటీ చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదే కనుక నిజమైతే విజయ్ కి ఘోరమైన ఓటమి తప్పేలా లేదు. ఎందుకంటే పెరంబూర్ స్థానం DMK పార్టీ కి కంచుకోట లాంటిది. ఎలాంటి స్థానం అంటే వై ఎస్ జగన్ కి పులివెందుల, చంద్రబాబు నాయుడు కి కుప్పం ఎలాగో, అలా DMK పార్టీ కి పెరంబూర్ అలాంటి స్థానం అట. 2019 వ సంవత్సరం లో ఉప ఎన్నికలు జరిపినప్పుడు ఈ ప్రాంతం నుండి పోటీ చేసిన RD శేఖర్ 106,394 ఓట్లను కైవసం చేసుకొని ఘనవిజయం సాధించాడు. అంటే దాదాపుగా 56 శాతం ఓటింగ్ అన్నమాట . మిగిలిన ముఖ్యమైన పార్టీ లకు 20 శాతం రేంజ్ లో వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. అలాంటి కంచుకోట ని విజయ్ ఎంచుకున్నాడు. ఇది చాలా సాహసోపేత నిర్ణయం. ఒకవేళ విజయ్ గెలిస్తే చరిత్ర సృష్టించినవాడు అవుతాడు.

ఆయన పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. కానీ 99% ఆయన ఈ స్థానం నుండి ఓడిపోయేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. విజయ్ పోటీ చేయడం వల్ల, ఆ ప్రాంతం లో ఓట్లు భారీ రేంజ్ చీలి DMK పార్టీ కి మెజారిటీ బాగా తగ్గిపోవచ్చు కానీ, గెలవడం మాత్రం అసాధ్యం అంటున్నారు. మరి ఏమి జరగబోతుందో చూడాలి. మరోవైపు విజయ్ ఎన్నికల ప్రచారం లో జోరుగా ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రతీ రోజు బహిరంగ సభలు ఏర్పాటు చేసి పవర్ ఫుల్ ప్రసంగాలతో ఓటర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి, వాటిని దాటుకొని ఈరోజు జనాల మధ్యలోకి రావడమే పెద్ద విశేషం. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాదిస్తాడో చూడాలి. ప్రస్తుతం సర్వేల ప్రకారం విజయ్ కి 9 నుండి 12 శాతం ఓటు షేర్ వస్తుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు, ఎడమ జరగొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version