షాకింగ్ న్యూస్: వాట్సాప్‌ హ్యాక్‌

సోషల్‌ మీడియాలో వాట్సాప్‌ ఒక వండర్‌‌ అని చెప్పాలి. మెస్సేజ్‌ కోసం.. సమాచారం చేరవేసేందుకు ఒకప్పుడు మెయిల్స్‌ వాడేవారం. కానీ.. వాట్సాప్‌ వచ్చాక అందరికీ ఈజీ అయిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉందా.. అందులో వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసేస్తున్నారు. అయితే.. అలాంటి వాట్సాప్‌పై హ్యాకర్స్‌ కన్నుపడిందంట. Also Read: షాకింగ్: వికటించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. ప్రయోగాలకు బ్రేక్ వాట్సాప్‌ను మెస్సేజ్‌లతోపాటే వీడియో కాల్స్‌ మాట్లాడేందుకూ ప్రతిఒక్కరూ వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్‌తో వినియోగదారులనూ వాట్సాప్‌ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం […]

Written By: NARESH, Updated On : September 9, 2020 11:46 am

Whats app

Follow us on

సోషల్‌ మీడియాలో వాట్సాప్‌ ఒక వండర్‌‌ అని చెప్పాలి. మెస్సేజ్‌ కోసం.. సమాచారం చేరవేసేందుకు ఒకప్పుడు మెయిల్స్‌ వాడేవారం. కానీ.. వాట్సాప్‌ వచ్చాక అందరికీ ఈజీ అయిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉందా.. అందులో వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసేస్తున్నారు. అయితే.. అలాంటి వాట్సాప్‌పై హ్యాకర్స్‌ కన్నుపడిందంట.

Also Read: షాకింగ్: వికటించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. ప్రయోగాలకు బ్రేక్

వాట్సాప్‌ను మెస్సేజ్‌లతోపాటే వీడియో కాల్స్‌ మాట్లాడేందుకూ ప్రతిఒక్కరూ వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్‌తో వినియోగదారులనూ వాట్సాప్‌ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వాట్సాప్‌కు హ్యాకర్స్‌ ముప్పు వచ్చిందంట. బ్రెజిల్‌కు చెందిన హాకర్స్‌ టెక్ట్స్‌ బాంబ్గా పిలిచే స్కేరీ మెస్సేజెస్‌ వైరస్‌తో వాట్సాప్‌ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాటీబా ఇన్ఫో తెలిపింది. ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించిందట.

కొద్దిరోజుల క్రితమే కొత్త ఫీచర్లలో భాగంగా Vacation mode, new UIని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా ఎలాంటి కొత్త ఫీచర్స్‌ కావాల్నో కూడా వాటాబీ ఇన్ఫో యూజర్లను వాట్సాప్‌ కోరింది. అందులో ఒకరు తనకు టెక్ట్స్‌ బాంబ్‌ సందేశాలు వస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. దీనిపై వాబీటా ఇన్ఫో స్పందించింది. ‘కొద్ది వారాల క్రితమే దీని గురించి మేం ప్రస్తావించాం. మా ఫాలోవర్స్‌లో కొంత మంది దీన్ని బినారియా, కాంటాక్ట్‌ బాంబ్స్‌, ట్రావా జాప్‌, క్రాషర్స్‌, వికార్డ్‌ క్రాస్‌, టెక్ట్స్‌ బాంబ్‌’ అని పిలుస్తారని తెలిపింది. ఆ మెస్సేజ్‌ను ఓపెన్‌ చేస్తే మాత్రం వాట్సాప్‌ క్రాష్‌ అవుతుందని వెల్లడించింది.

అసలీ టెక్ట్స్‌ బాంబ్‌ అంటే ఏమిటంటే.. కొన్ని స్పెషల్‌ క్యారెక్టర్స్ను సీరియల్‌గా ఉంచి.. ఒక మెస్సేజ్‌ లేదా ఏదైనా ఆర్ట్ రూపంలో సృష్టంచి ఫార్వార్డ్‌ మెస్సేజ్‌లా పంపుతారు. దీనిని రిసీవ్‌ చేసుకొని ఓపెన్‌ చేయగానే వాట్సాప్‌ క్రాష్‌ అవుతుంది. వాట్సాప్‌ క్రాష్‌ అయింది కదా అని చెప్పి తిరిగి ఓపెన్‌ చేసేందుకు ట్రై చేస్తే ఫోన్‌ క్రాష్‌ అయ్యే అవకాశమూ ఉంది.

Also Read: మందులతో మగపిల్లలు పుడుతారా..?

అందుకే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్సాప్‌ యూజర్స్‌ అన్‌ నోన్‌ మెస్సేజ్‌లను ఓపెన్‌ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు టెక్‌ నిపుణులు. దీనిపై వాట్సాప్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కొత్త ఐఓఎస్‌ వెర్షన్‌లో ఈ సమస్యను ఎదుర్కొనేలా మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. యూజర్స్‌ కూడా తమ వాట్సాప్‌ యాప్‌, ఫోన్‌ ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.