Homeఅంతర్జాతీయంTrump worst president ranking: అమెరికాలో వరస్ట్‌ ప్రెసిడెంట్‌గా ట్రంప్‌.. దారుణంగా పడిపోయిన ర్యాంక్‌

Trump worst president ranking: అమెరికాలో వరస్ట్‌ ప్రెసిడెంట్‌గా ట్రంప్‌.. దారుణంగా పడిపోయిన ర్యాంక్‌

Trump worst president ranking: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌.. మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అమెరికా చరిత్రలో ఏడాదిలోనే ప్రజల విశ్వాసం దారుణంగా కోల్పోయి వరస్ట్‌ ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టించాడు. 2024 నవంబర్‌ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2025 జనవరి 21న బాధ్యతలు చేపట్టాడు. కానీ అతని నిర్ణయాలు, వ్యవహార శైలి, టారిఫ్‌ వార్, ధరల పెరుగుదల తదితర కారణాలతో ట్రంప్‌ ర్యాంకు అనూహ్యంగా పడిపోయింది. వన్‌ పోల్‌ సర్వే ప్రకారం, ట్రంప్‌ రెండో మండేట్‌ మొదటి ఏడాదిలోనే 40% అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు, కేవలం 12% ’బెస్ట్‌’ అని చెబుతున్నారు.

ఇమ్మిగ్రేషన్‌ నుండి ధరల వరకు..
అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసల నియంత్రణ, కఠిన నిబంధనలు అమలు చేసిన ట్రంప్‌పై 38% వ్యతిరేకత ఏర్పడింది. టారిఫ్స్‌ వల్ల నిత్యావసరాల ధరలు డాలర్లు 1500 పెరగడం, నెలవారీ బడ్జెట్‌కు భారం పెట్టింది. ఆరు నెలల క్రితం పెద్ద నిరసనలు, ఎప్సీ్టన్‌ ఫైల్స్‌ విడుదల ర్యాంకును మరింత పడిపోయేలా చేశాయి.

అంతర్జాతీయ ఒత్తిడి..
ఫెడరల్‌ ఏజెన్సీల నిర్ణయాలు విదేశీ సంబంధాలను దెబ్బతీశాయి, యూరోపియన్‌ యూనియన్, నాటో దేశాలు విధానాలను నిరసిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, రక్షణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ’అమెరికా ఫస్ట్‌’ నినాదం 2024 ఎన్నికల్లో యువతను ఆకర్షించినా, పాలన తీరు చూసి అండ బలహీనపడింది.

ట్రంప్‌ ర్యాంకింగ్‌ పతనానికి కీలక కారణాలు
వన్‌ పోల్‌ సర్వేలో ట్రంప్‌ అప్రూవల్‌ రేటింగ్‌ 47 శాతం నుండి 37–40 శాతానికి పడిపోవడానికి ప్రధాన కారణాలు వాణిజ్య సుంకాలు, ఇమ్మిగ్రేషన్‌ విధానాలు. భారత్‌తోపాటు విదేశీ దేశాలపై విధించిన టారిఫ్స్‌ వల్ల అమెరికాలో నిత్యావసరాల ధరలు డాలర్లు 1500 పెరగడం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించింది.

ధరల పెరుగుదల ప్రభావం
టారిఫ్స్‌ అమెరికన్‌ కుటుంబాల నెలవారీ ఖర్చును విపరీతంగా పెంచాయి, మధ్యతరగతి ప్రజల్లో ఇరకలో వేశాయి. రిపబ్లికన్‌ ఓటర్లలో కూడా ఆమోదం 90 నుండి 84 శాతానికి తగ్గడం ఈ సమస్య లోతును చూపిస్తుంది. ఆరు నెలల క్రితం జరిగిన నిరసనలు ఈ ఆర్థిక భారాన్ని హైలైట్‌ చేశాయి.

ఇమ్మిగ్రేషన్‌ విధానాలు..
కఠిన వలస నియంత్రణలు మొదట 47 శాతం మద్దతు పొందినా, తర్వాత 39–53 శాతం వ్యతిరేకతకు మారాయి. యువత, మధ్యతరగతి వర్గాల్లో ప్రతికూల భావన పెరిగింది, ఎందుకంటే అమలులో అసౌకర్యాలు, హ్యూమానిటేరియన్‌ సమస్యలు బయటపడ్డాయి.

ఎప్సీ్టన్, విదేశీ సంబంధాలు..
ఎప్సీ్టన్‌ ఫైల్స్‌ విడుదల, యూరోపియన్‌ యూనియన్, నాటోతో ఘర్షణలు ట్రంప్‌ ఇమేజ్‌ను మరింత దెబ్బతీశాయి. 12 శాతం మాత్రమే ’బెస్ట్‌’ అని చెప్పడం అతని 2024 విజయాన్ని ప్రశ్నించేలా చేసింది.

నవంబర్‌ 2026 మిడ్‌–టర్మ్‌ ఎన్నికల సమయంలో ట్రంప్‌ వ్యతిరేకత కాంగ్రెస్‌ సీట్లను తగ్గించే అవకాశం ఉంది. రిపబ్లికన్లు ఈ పతనం వల్ల ఆందోళన చెందుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version