https://oktelugu.com/

బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !

కరోనా కాలం ఇంకా పోకముందే షూటింగ్ లను మొదలుపెట్టేశారు మన హీరోలు. సాయితేజ్, నాగచైతన్య, క్రిష్ టీం, నాగార్జున ఇలా కొంతమంది షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. కానీ మిగిలిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇప్పుడు షూట్ ఏంటి.. ఎందుకు రిస్క్ అంటూ ఇప్పట్లో షూటింగ్ వద్దు అంటున్నారు. పైగా ఈ ఏడాది మొత్తం షూట్ పోస్ట్ ఫోన్ చేస్తారట. కానీ బాలయ్య మాత్రం షూట్ కి రెడీ అంటున్నాడు. బోయపాటితో […]

Written By:
  • admin
  • , Updated On : September 9, 2020 / 11:04 AM IST
    Follow us on


    కరోనా కాలం ఇంకా పోకముందే షూటింగ్ లను మొదలుపెట్టేశారు మన హీరోలు. సాయితేజ్, నాగచైతన్య, క్రిష్ టీం, నాగార్జున ఇలా కొంతమంది షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. కానీ మిగిలిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇప్పుడు షూట్ ఏంటి.. ఎందుకు రిస్క్ అంటూ ఇప్పట్లో షూటింగ్ వద్దు అంటున్నారు. పైగా ఈ ఏడాది మొత్తం షూట్ పోస్ట్ ఫోన్ చేస్తారట. కానీ బాలయ్య మాత్రం షూట్ కి రెడీ అంటున్నాడు. బోయపాటితో పాటు బాలయ్య కుటుంబ సభ్యులు కూడా కొన్నాళ్లు ఆగుదాం అంటున్నా… నాకేం భయం షూట్ చేయాల్సిందే అంటున్నాడట. పైగా అందరి కంటే మనమే ముందు షూటింగ్ ను పూర్తి చేయాలని.. సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని బాలయ్య సన్నాహాలు చేస్తున్నాడు. దాంతో బోయపాటి శ్రీను ప్రస్తుతం షెడ్యూల్ వేస్తున్నాడు. సెప్టెంబర్ 14 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజీ సెట్ లో షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు.

    Also Read: డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?

    నిజానికి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తీయాలనుకున్నారు. సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఉండటంతో ఎక్కువమంది సిబ్బంది షూట్ కి అవసరం అవుతారు. ఈ కరోనా కాలంలో అధిక సిబ్బందితో షూట్ అనేది సాధ్యం కాదు, అందుకే బోయపాటికి కూడా ఇప్పుడు షూట్ చేయడం ఇష్టం లేదనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అయితే కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉన్నా.. ఇప్పుడు షూట్ చేయకపోతే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయలేరు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు సినిమాని పూర్తి చేయాలి. మరి బాలయ్య ఊపు చూస్తుంటే.. నవంబర్ లోపే షూటింగ్ ను పూర్తి చేసేలా ఉన్నాడు. కాకపోతే షూట్ స్టార్ట్ చేసి పూర్తి చేసేదాకా మిగిలిన నటీనటులు కూడా అంతే క్రమశిక్షణతో సపోర్ట్ చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న.

    Also Read: బ్రేకింగ్: సుశాంత్ కేసులో రియా అరెస్ట్

    ఇది బాలయ్య బాబు సినిమా కాబట్టి.. ఆయనకు కోపం వస్తే.. క్యారెక్టర్ తో పాటు యాక్టర్ కూడా రిస్క్ లో పడతాడు కాబట్టి.. ఇష్టం ఉన్నా లేకపోయినా షూట్ కి రావాల్సిందే. అయితే ఇక్కడ మరో సమస్య ఏంటంటే.. రెండు సంవత్సరాల నుండి వెతుకుతున్నా ఇంతవరకూ బాలయ్య బాబుకు ఫామ్ లో ఉన్న హీరోయిన్ దొరకలేదు. దాంతో బోయపాటి ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు. అయితే ఒకపక్క కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా దెబ్బకు సినీ లోకం అల్లాడిపోయింది. ఇంకా ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. బాలయ్య తోటి హీరోలు వెంకీ, చిరు లాంటి స్టార్ హీరోలు కరోనా వల్లే.. ఈ సంవత్సరం మొత్తం షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. అలాగే కొంతమంది హీరోలు సైతం షూటింగ్ అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది.