Rajinikanth: 75 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ, వాళ్ళతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయం లో పోటీ పడుతున్న ఏకైక నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) మాత్రమే. తమిళ సినిమా పరిశ్రమ ని దశాబ్దాల నుండి ఏలుతున్నాడు. ఈమధ్య కాలం లో అజిత్, విజయ్ వంటి సూపర్ స్టార్స్ ఆయనకు పోటీగా వచ్చారు కానీ, సరైన హిట్ తగిలినప్పుడు మాత్రం వాళ్లిద్దరూ రజినీకాంత్ స్టార్ డమ్ ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఆయన హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఇక గత ఏడాది విడుదలైన కూలీ చిత్రం తమిళ సినిమాకు మొట్టమొదటి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా 500 కోట్లకు పైన గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇప్పటికీ కూడా రజినీకాంత్ మాత్రమే కోలీవుడ్ కి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాని తీసుకొని రాగలదు అని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ సెట్ చేసుకున్న కాంబినేషన్స్ కూడా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉన్న సినిమాలే. అందులో మొదటిది కమల్ హాసన్ నిర్మాతగా ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ పై ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సీబీ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రెండవది కమల్ హాసన్ తో మల్టీస్టార్రర్ చిత్రం. దీనికి సంబంధించిన ప్రోమో ని నిన్ననే విడుదల చేశారు. ఈ రెండు సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టేంత సత్తా ఉంది. ఇదంతా పక్కన పెడితే రజినీకాంత్, సీబీ చక్రవర్తి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియా లో పెద్ద ప్రచారం సాగుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రియాంక అరుళ్ మోహనన్, పూజ హెగ్డే నటించబోతున్నట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరు 30 ఏళ్ళ వయస్సులో ఉన్నవారే, అంత చిన్న వాళ్ళు రజినీకాంత్ పక్కన హీరోయిన్స్ గా నటించడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే రజినీకాంత్ ఈమధ్య కాలం లో తన వయస్సుకు తగ్గ పాత్రలే చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆయనకు భార్య క్యారెక్టర్ వేసినా, జనాల చేత ఒప్పించే రేంజ్ లోనే ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ కాంబినేషన్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ఫోకస్ మొత్తం ‘జైలర్ 2’ మీదనే ఉంది.