spot_img
Homeఎంటర్టైన్మెంట్Nidhhi Agerwal Viral Video: అసౌకర్యమైన బట్టలు వేసుకొచ్చి నవ్వులపాలైన హీరోయిన్ నిధి అగర్వాల్..వీడియో వైరల్!

Nidhhi Agerwal Viral Video: అసౌకర్యమైన బట్టలు వేసుకొచ్చి నవ్వులపాలైన హీరోయిన్ నిధి అగర్వాల్..వీడియో వైరల్!

Nidhhi Agerwal Viral Video: ఈమధ్య కాలం లో హీరో శివాజీ హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ టాపిక్ మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ అంశంలో శివాజీ కి సపోర్ట్ చేసిన వారు ఎక్కువ. చక్కగా హీరోయిన్లు చీర కట్టుకొని వస్తే, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదు కదా , ఎందుకు లేని పోనీ విచిత్రమైన కాస్ట్యూమ్స్ ని వేసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ, జనాలను కూడా ఇబ్బందికి గురి చేయడం అంటూ శివాజీ మాటలతో ఏకీభవించారు. ఆరోజు శివాజీ అలా మాట్లాడడానికి కారణం లుల్లూ మాల్ లో నిధి అగర్వాల్ కి జరిగిన సంఘటననే. ఆమె లుల్లూ మాల్ నుండి బయటకు వెళ్తున్న సమయం లో అభిమానులు ఒక్కసారిగా ఆమెని చుట్టముట్టడం, ఆ సమయం లో ఆమె దుస్తులు సైతం చిరిగిపోయి పరిస్థితి రావడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

దీనిని ఆధారంగా చేసుకొనే ఆరోజు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ శివాజీ వివరణ కూడా ఇచ్చాడు. ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని నిన్న జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా నిల్చింది. పూర్తి వివరాల్లోకి నిన్న నిధి అగర్వాల్ ఒక ఈవెంట్ కి హాజరు అయ్యింది. ఆ ఈవెంట్ లో ఆమె ధరించిన దుస్తులు కారణంగా ఎంతో అసౌకర్యానికి గురైంది. ఆమె దుస్తులకు సంబంధించిన క్రింది భాగం నెలకు తాకుతూ ఉండగా, దానిని పైకి ఎత్తి పట్టుకోవడానికి ఇద్దరు అసిస్టెంట్స్ సహాయం కావాల్సి వచ్చింది. అంతటి బరువైన బట్టలు వేసుకొని పబ్లిక్ ఈవెంట్స్ కి వచ్చి అంత ఇబ్బంది పడడం ఎందుకు. సింపుల్ గా రావొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంతమంది అయితే నిధి అగర్వాల్ ఉద్దేశపూర్వకంగానే శివాజీ కి కౌంటర్ ఇస్తున్నట్టుగా ఈ బట్టలు వేసుకొచ్చిందని అంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము, చూసేయండి. ఇకపోతే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాకు ముందు ఆమె హీరోయిన్ గా నటించిన ‘హరి హర వీరమల్లు’ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇలా కెరీర్ లో వరుసగా ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో నటించినప్పటికీ కూడా నిధి అగర్వాల్ కి అదృష్టం ఇసుమంత కూడా కలిసి రాలేదు. మరి ఈమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper
Exit mobile version