Mega Family Sankranthi Celebrations: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు సినిమాలను చేస్తు చాలా బిజీగా ఉంటారు. పండగలు వచ్చినప్పుడు మాత్రం తమ ఫ్యామిలీతో కలిసి పండగ వాతావరణం ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పండుగ వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒకటైపోయి పండగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే కొన్ని వీడియోలను సైతం తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. దీని వల్ల తమ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున పండుగని జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఉపాసన, లావణ్య త్రిపాఠి లాంటివారు సైతం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు… ఇక ఇంట్లో వరుణ్ తేజ్ దోశలు వేస్తుంటే, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు…
ఇక ఈ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పాలి.
మెగా అభిమానులు మెగాస్టార్ ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తుంటే మెగా ఫ్యామిలీ సైతం ఇంట్లో సంక్రాంతి పండగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీ హీరోలందరు పండగ వచ్చిందంటే చాలు ఒకటై పోవడం వాళ్ల అభిమానులకు ఆనందాన్ని కలిగింపజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలన్నీ సూపర్ సక్సెస్ ని సాధిస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక ఈ సంవత్సరం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో వస్తుంటే సాయి ధరమ్ తేజ్ సైతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. వరుణ్ తేజ్ సైతం కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు…