Homeఅంతర్జాతీయంIran America Tensions: ఇరాన్ వైపు పాకిస్తాన్ సైన్యం.. అమెరికా ఆదేశాలతో యుద్ధానికి రెడీ

Iran America Tensions: ఇరాన్ వైపు పాకిస్తాన్ సైన్యం.. అమెరికా ఆదేశాలతో యుద్ధానికి రెడీ

Iran America Tensions: వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఆయన దేవంలో చొరడి ఎత్తుకొచ్చిన అమెరికా.. ఇక ప్రపంచంలో ఏ దేశంలో అయినా దాడికి తాము సిద్ధమని అహంకారం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిరసనలు వెల్లువెత్తుతున్న ఇరాన్‌పై దాడికి ప్లాన్‌ చేస్తోంది. ఇరాన్‌ చర్చలకు పిలిచినా చర్చలు జరిపేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. నిరసనలు కొనసాగించాలని ఇరాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. అవసరమైతే ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

రంగంలోకి పాకిస్తాన్‌ సైన్యం..
అమెరికాతో ఏడాదిగా సన్నిహితంగా కొనసాగుతున్న పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ ఇప్పుడు ఇరుకున పడుతున్నారు. ఇటీవలే హమాస్‌ను అంతం చేయడానికి పాలస్తీనాలో యూఏఈ సైన్యంతో కలిసి పాల్గొనాలని డొనాల్డ ట్రంప్‌ పాకిస్తాన్‌ పీల్డ్‌ మార్షల్‌ను ఆదేశించారు. పాకిస్తాన్‌ ప్రజలకు పాలస్తీనాతో సత్సంబంధాలు సానుభూతి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా, హమాస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగడం పాకిస్తాన్‌ సైన్యానికి సవాల్‌గా మారింది. దీనిపై తర్చనభర్జన పడుతున్న తరుణంలో పాకిస్తాన్‌కు ట్రంప్‌ నుంచి మళ్లీ కీలక ఆదేశాలు అందాయి. ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో పాకిస్తాన్‌కు చెందిన 30 వేల మంది సైనికులను ఇరాన్‌ సరిహద్దులో మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇస్లామ్‌ దేశంపైనే యుద్ధం..
పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు అమెరికా అధికారుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌లో అమెరికా–ఇజ్రాయిల్‌ కూటమి ఏదైనా భూ ఆపరేషన్‌లకు మద్దతుగా ఈ చర్య ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మధ్యప్రాచ్యలో ఇజ్రాయిల్‌–ఇరాన్‌ మధ్య ఘర్షణలు తీవ్రమైన స్థితిలో ఉన్నాయి, ఇది ప్రాంతీయ భద్రతకు సవాలుగా మారింది.

భారత్‌పై ప్రభావం..
ఈ పరిణామాలు భారతదేశానికి కూడా ప్రభావం చూపవచ్చు. పాకిస్తాన్‌ ఇరాన్‌ సరిహద్దులో శ్రద్ధ పెంచడం వల్ల భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దులపై ఒత్తిడి తగ్గవచ్చు. అయితే, అమెరికా ప్రభావంతో పాకిస్తాన్‌ మధ్యప్రాచ్య విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే, దక్షిణాసియాలో బలాబలాలు మారుతాయి. భారత్‌ తన రక్షణ వ్యూహాలను మళ్లీ పరిశీలించాల్సి వస్తుంది.

అంతర్జాతీయ పరిణామాలు
అమెరికా–ఇజ్రాయిల్‌ కోఆర్డినేషన్‌ పెరిగితే, ఇరాన్‌పై భూ దాడుల అవకాశం ఉంది. పాకిస్తాన్‌ ఈ సందర్భంలో తన సరిహద్దులను రక్షించుకోవడమే కాకుండా, మిత్రరాజ్యాలకు సహాయం చేయవచ్చు. ఇది చైనా, రష్యా వంటి ఇరాన్‌ మిత్రులతో ఉద్రిక్తతలను పెంచవచ్చు. ప్రపంచ శాంతి కోసం ఐక్యరాష్ట్ర సమితి జోక్యం అవసరం.

యుద్ధం జరిగితే ప్రభావాలు
ఇరాన్‌పై యుద్ధం మొదలైతే చమురు ధరలు పెరగవచ్చు, ఇది భారత్‌లో ఇన్‌ఫ్లేషన్‌కు కారణమవుతుంది. పాకిస్తాన్‌–అమెరికా బంధాలు బలపడతాయి, ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతాయి. బాలూచిస్తాన్‌ వంటి ప్రాంతాల్లో తిరుగుబాట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 ప్రారంభించేందుకు అనువైన సమయం.

ఈ చర్యలు మధ్యప్రాచ్య యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్‌ ఈ నిర్ణయం తీసుకునేలా అమెరికా ఒత్తిడి చేసిందా అనేది ఇంకా స్పష్టంగా లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version