Big Beautiful Bill: డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయ్యాడు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అనే నిర్ణయాలు తీసుకుంటూ వివాదాలకు కేరాఫ్‌గా మారారు. ఇటు అమెరికన్లను, అమెరికాలో స్థిరపడిన విదేశీయులతోపాటు, ప్రపంచ దేశాలనుసైతం తన నిర్ణయాలతో టెన్షన్ పెడుతున్నారు. తాజాగా ఆయన తన డ్రీమ్ యాక్ట్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను ఆమెదింపజేసుకున్నారు.
ఏంటీ బిల్..?
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అనేది అమెరికాలో ప్రతిపాదిత ఒక సమగ్ర శాసనం, ఇది ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలలో విస్తృతమైన మార్పులను లక్ష్యంగా చేసుకుంది. ఈ బిల్లు పన్ను సంస్కరణలు, సరిహద్దు భద్రత, రక్షణ ఖర్చులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా రుణాల నియంత్రణ వంటి అనేక అంశాలను కవర్ చేస్తుంది.
బిల్ ముఖ్యాంశాలు..
పన్ను సంస్కరణలు..
వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ 2017 టాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్‌ను శాశ్వతంగా కొనసాగించడాన్ని ప్రతిపాదిస్తుంది. ఇందులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఒంటరి వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ 750 డాలర్ల నుమచి 15,750 డాలర్లకు చేరుతుంది. కారు లోన్ వడ్డీ రాయితీ 1,00,000 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు (లేదా జంటలకు 200,000 డాలర్లు) అమెరికాలో తయారైన వాహనాల కొనుగోలుకు 10 వేల డాలర్ల వరకు వడ్డీ రాయితీ ఇస్తుంది. స్టేట్ అండ్ లోకల్ టాక్స్ డిడక్షన్ 2029 వరకు 40 వేల డాలర్లకు పెంచింది. సంపన్న కళాశాలలపై ఎక్సైజ్ టాక్స్ 8%కి పెంచబడింది, అయితే తక్కువ ఆస్తులున్న సంస్థలకు 4% లేదా 1.4% రేట్లు వర్తిస్తాయి.
సరిహద్దు భద్రత, ఇమ్మిగ్రేషన్..
ఈ బిల్లు సరిహద్దు భద్రతకు భారీ నిధులను కేటాయిస్తుంది. అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి 46.5 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 30 బిలియన్ డాలర్లు కేటాయించింది. మొత్తం సరిహద్దు భద్రతకు సుమారు 150 బిలియన్ డాలర్లు్ల కేటాయించబడ్డాయి.
రక్షణ ఖర్చులు…
రక్షణ రంగంలో గణనీయమైన పెట్టుబడులు వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్‌లో భాగమే. మొత్తం రక్షణ బడ్జెట్ 153 మిలియన్ డార్ల అదనపు ఖర్చు చేయనుంది. అధ్యక్షుడు ప్రతిపాదించిన ‘‘గోల్డెన్ డోమ్’’ కోసం 25 బిలియన్ డాలర్లు కేటాయించింది. నౌకా నిర్మాణానికి 29 బిలియన్ డాలర్లు కేటాయించింది.
విద్య రుణాలు..
ఫెడరల్ స్టూడెంట్ లోన్‌లకు జీవితకాల పరిమితి 2,57,500 బిలియన్ డాలర్లు, ప్రొఫెషనల్ డిగ్రీలకు సంవత్సరానికి 50 వేల డాలర్లు, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అన్‌సబ్సిడైజ్డ్ లోన్‌లు ఏడాదికి 20,500 డాలర్లు, 2024 నుండి 2028 మధ్య జన్మించిన పిల్లల తల్లిదండ్రులకు 1,000 ప్రారంభ నిధితో కొత్త ఖాతాలు ఇవ్వనుంది.
Also Read: ఆ దేశ జాతీయ పక్షి కాకి. మన పొరుగు దేశమే. కానీ పాకిస్తాన్ కాదు.
బిల్లుతో లాభమా.. నష్టమా?
ఇది ఆర్థిక ఉద్దీపన, భద్రత, సామాజిక సంక్షేమంపై దృష్టి సారిస్తుంది. పన్ను రాయితీలు, క్రెడిట్‌లు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరటనిస్తాయి, అయితే రుణ పరిమితి పెంపు దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. సరిహద్దు గోడ, రక్షణ ఖర్చులపై భారీ పెట్టుబడులు జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి, కానీ ఇవి రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. అబార్షన్ నిధులపై ఆంక్షలు, వర్క్ రిక్వైర్‌మెంట్‌లు కొన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అయితే గ్రామీణ ఆసుపత్రులకు నిధులు సానుకూల అడుగుగా పరిగణించబడవచ్చు. విద్యార్థి రుణ పరిమితులు బాధ్యతాయుతమైన రుణాలను ప్రోత్సహిస్తాయి, కానీ విద్యా అవకాశాలను పరిమితం చేయవచ్చు.