Crow The National Bird: ప్రతి దేశానికి గుర్తింపుగా జాతీయ పక్షి ఉంటుంది. రాష్ట్రాలకు కూడా రాష్ట్ర పక్షి ఉంటుంది. ఇలానే జంతువులు, పువ్వులు కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే హిందూ సంప్రదాయంలో చాలా మంది కాకిని నెగటివ్ గా సూచిస్తారు కదా. కాకి ఎదురు వచ్చినా కీడని, కాకి కనిపించినా కీడని. ఇంటి మీద వాలవద్దని ఇలా చాలా రకాలుగా చెబుతుంటారు. అంతేకాదు కాకి ఎగురుతూ తలకు కూడా తాగవద్దు అంటారు. ఇంటి మీద కూర్చొని కాకి అరిస్తే కూడా మంచిది కాదు అంటారు. కానీ ఎవరైనా చనిపోతే కాకి వచ్చి పిండం ముట్టే వరకు ఎదురుచూస్తూనే ఉంటారు. ఇలా హిందూ సంప్రదాయంలో కాకికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ అది కాస్త నెగటివ్ స్థానమే కదా. కానీ ఓ దేశం మాత్రం కాకిని జాతీయ పక్షిగా ఉంచింది. నమ్మడం లేదు కదా. కానీ మీరు చదివింది నిజం. ఇంతకీ ఏ దేశం అనుకుంటున్నారా? అయితే చూసేయండి.
Also Read: తిరుమలలో ఏనుగుల గుంపు సడెన్ ఏంట్రి.. ఏం జరిగిందంటే?
ప్రపంచంలోని చాలా దేశాలు తమ జాతీయ పక్షిని, జాతీయ జంతువును ఎంచుకుంటాయి. భారతదేశంలో నెమలి, అమెరికాలో బట్టతల డేగ, న్యూజిలాండ్‌లో కివి వంటి జాతీయ పక్షులు ఉన్నాయి. భారతదేశ పొరుగు దేశాల గురించి చెప్పాలంటే, పాకిస్తాన్ జాతీయ పక్షి చుకార్ నెమలి. దీని శాస్త్రీయ నామం అలెక్టోరిస్ చుకార్. అయితే, బంగ్లాదేశ్ జాతీయ పక్షి మాగ్పీ రాబిన్. UPSC సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలలో జాతీయ జంతువులు, పక్షుల గురించి తరచుగా ప్రశ్నలు అడుగుతారు.
భారతదేశానికి పొరుగు దేశానికి ఉన్న జాతీయ పక్షి కాకి జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం కార్వస్ కోరాక్స్. దీనిని హిందీలో కాలా కాగ్ అంటారు. ఇంతకీ ఆ దేశం ఏంటి అనుకుంటున్నారా? దాని పేరు భూటాన్. రాజు కిరీటంపై కూడా రావెన్ ఉంటుంది. భూటాన్‌లో కాకి రాచరికం, ఆధ్యాత్మిక శక్తికి చిహ్నం. భూటాన్ రాజు కిరీటంపై కూడా కాకి తల చెక్కారు. ఇక్కడ దీనిని రక్షణ పక్షిగా, శుభ సంకేతంగా భావిస్తారు. భూటాన్‌లో దీనిని జరోగ్ డోంగ్చెన్ అని పిలుస్తారు.
Also Read: మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను రిజెక్ట్ చేస్తున్నారా? అయితే ఇలా చేస్తే సక్సెస్ అవుతుంది.
2006 సంవత్సరంలో ఎంపిక అయిన జాతీయ పక్షి
2006లో భూటాన్ జాతీయ పక్షిగా కాకిని ఎంపిక చేశారు. భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది భూటాన్ రక్షకులలో ఒకరిగా పరిగణించే భూటాన్ దేవత లెగాన్ జరోగ్ డోంగ్‌చెన్‌తో సంబంధం కలిగి ఉంది. ఈ దేవత దైవిక త్రిమూర్తులలో భాగం. ఇందులో యేషే గొన్పో (మహాకాల), పాల్డెన్ (మహాకాలి) ఉన్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.