Traffic Police: రోడ్డుపై వాహనాల్లో ప్రయానించేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ పేపర్స్ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. Road Transport Act ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ పత్రాలను కలిగి ఉండాలి. లేకుంటే ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్ విధిస్తుంటారు. కొందరు వాహనాలను దొంగించడం లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులు ఇలా చేస్తుంటారు. అయితే ఫిజికల్ గా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ పేపర్స్ లేకున్నా.. మొబైల్ ఉండడం వల్ల ఇందులోని ఆర్టీఏ యాప్ ద్వారా వారికి సరైన వివరాలు అందిస్తే సరిపోతుంది. కానీ కొన్ని సమయంలో ఈ పేపర్స్ తో పాటు మొబైల్ కూడా మరిచిపోయి వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పోలీసులు ఆపితే ఏం చేయాలి? ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్ కట్టాల్సి ఉంటుందా? అవసరం లేదు.. ఎందుకంటే?
రోడ్ ట్రాన్స్ పోర్ట్ ప్రకారం వాహనదారుల సౌలభ్యం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ వీటి గురించి చాలా మంది అవగాహన లేదు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ పేపర్స్ లేని సమయంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే సంబంధిత ఫైన్ చెల్లిస్తారు. కొందరు ఫైన్ చెల్లించకపోతే వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. ఆ తరువాత కోర్టులో సమర్పిస్తారు. ఇలా వెళ్తే భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేతిలో ఇవి లేకున్నా భారీ ఫైన్ తో కాకుండా చిన్న పాటి అమౌంట్ చెల్లంచి వీటిని తెచ్చుకోవచ్చు.
ప్రయాణం చేసే సమయంలో పై డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీపేపర్స్, ఇన్సూరెన్స్ పేపర్స్.. ఇలా పోలీసులు ఎన్ని పత్రాలు అడిగారో.. వాటికి సంబంధించి డాక్యమెంట్లు ఇంట్లో ఉండే గనుక.. 15 రోజుల లోపు సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమర్పించవచ్చు. అయితే పోలీసులు అడిగిన సమయానికి పత్రాలు లేకపోవడం వల్ల అందుకు మినిమం ఛార్జీలు మాత్రం చెల్లించాలి. అవి ఒక్కో పత్రానికి రూ. 100 అంటే మొత్తం రూ.300 లేదా ఇంకా ఇతర పత్రాల కోసం ఎన్ని అంటే అన్ని రూ. 100 చొప్పున చెల్లంచాలి.
కానీ కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 15 రోజుల తరువాత కూడా ఈ పేపర్స్ కూడా ఇవ్వకపోతే మాత్రం భారీగా జరినామా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సొంత బైక్ ఉన్న వారు ఈ పత్రాలకు కచ్చితంగా చెల్లిస్తారు. కానీ ఎవరైనా బైక్ ను దొంగిలిస్తే మాత్రం వీటిని చెల్లించరు. ఇలాంటి పరిస్థితి కోసం ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చారు. అయితే సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ పేపర్స్ ను వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా దూరం ప్రయాణించే సమయంలో ఒక్కోసారి ఇంట్లో ఈ డాక్యమెంట్స్ మరిచిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా వీటిని చూపించి జరిమానా నుంచి తప్పించుకోకోవడానికి ప్రయత్నించాలి.