Tollywood: తెలుగు లో ఈ 3 సంవత్సరాల్లో చిన్న సినిమాలుగా వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్న మూవీస్ ఇవేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు... ఇక వాళ్ల ప్రయత్నాలు సఫలం అయిన అవ్వకపోయిన వాళ్ళు భారీ సినిమాలు చేస్తూనే ముందుకు సాగుతున్నారు. అలా కాకుండా చిన్న సినిమాలను చేస్తూ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే వాళ్ళు ఆదరిస్తారనే ఒక చిన్న విషయాన్ని మరిచిపోయి ఎంతసేపు పెద్ద సినిమాలనే టార్గెట్ గా పెట్టుకొని ముందుకెళ్తున్న హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు...

Written By: Gopi, Updated On : October 28, 2024 5:38 pm

Tollywood

Follow us on

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. నిజానికైతే పెద్ద సినిమాలను భారీ బడ్జెట్ తో తీసి సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోలు చాలా మార్కెట్ ని అంతకు అంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ చిన్న సినిమాల విషయంలో అలా జరగడం లేదు. ఒక సినిమా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే వాళ్ళు తప్పకుండా సినిమాని ఆదరిస్తున్నారు. తద్వారా ఆ సినిమా టాక్ నిదానం గా విస్తరిస్తూ ఉండటంతో ఆ సినిమాను టాప్ లెవల్లోకి తీసుకెళ్తున్నారు. గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి మన సినిమాలను అబ్జర్వ్ చేసినట్లైతే చిన్న సినిమాల్లోనే మంచి విజయాలు దక్కుతున్నాయి. ముఖ్యంగా జాతి రత్నాలు, బేబీ, డిజె టిల్లు, హనుమాన్ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. నిజానికి ఈ సినిమాల్లో కంటెంట్ ఉండడంతో సినిమాలు ఎగ్జిక్యూషన్ పరంగా అంత పర్ఫెక్ట్ గా లేకపోయిన కూడా ఆ సినిమాలనేవి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. అందుకే ఒక సినిమా విషయంలో కథ అనేది చాలా కీలకపాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమాల బాటలోనే మరికొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా చిన్న సినిమాకు ఉండే ఆదరణ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది.

కానీ కంటెంట్ బాగుంటే మాత్రం ఆయా సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలుస్తాయి…అయితే ఆ చిన్న కంటెంట్ ను మిస్లిడ్ చేయకుండా సరిగ్గా వాడుకుంటే మాత్రం చిన్న సినిమాల్లోనే వండర్స్ ని క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ ను సాధించవచ్చు. కాబట్టి ఆ రకంగా అలాంటి సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరి మన్ననలు పొందిన హీరోలు చాలా మందే ఉన్నారు..మరి ఇలాంటి సందర్భంలోనే చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులు కూడా ఉన్నారు.

ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక చిన్న కంటెంట్ తోనే వచ్చి పెద్ద సక్సెస్ సాధిస్తే వాళ్లకు భారీ రేంజ్ లో రెస్పాన్స్ అయితే దక్కుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా అనేది బాగుండాలంటే కథ అద్భుతంగా ఉండాలి. అది బాగుంటేనే సినిమా అనేది భారీగా ఎలివేట్ అవుతుంది. తద్వారా సక్సెస్ ని కూడా సాధిస్తుంది…