Game Changer: RRR లోని సన్నివేశాన్ని ‘గేమ్ చేంజర్’ కోసం వాడేసారా..? శంకర్ అడ్డంగా దొరికేశాడుగా!

హాలీవుడ్ లో కూడా ఇలాంటి టేకింగ్ తో ఫైటింగ్ సన్నివేశం ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు దానిని డైరెక్టర్ శంకర్ 'గేమ్ చేంజర్' చిత్రం లో రీ క్రియేట్ చేయబోతున్నాడా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. కారణం నిన్న సాయంత్రం విడుదల చేసిన పోస్టర్.

Written By: Vicky, Updated On : October 28, 2024 5:31 pm

Game Changer(5)

Follow us on

Game Changer: #RRR కి ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో టాప్ 5 ఇంట్రడక్షన్ సన్నివేశాలు చెప్పమంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన సినిమాల్లోని ఇంట్రడక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. కేవలం 5 చెప్పమంటే అభిమానులకు కూడా ఎంచుకోవడం కష్టంగా ఉండేది. కానీ డైరెక్టర్ రాజమౌళి ఆయనకి #RRR చిత్రంతో అభిమానులు జీవితాంతం గుర్తించుకోదగ్గ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని ఇచ్చాడు. దీనిని కొట్టే ఇంట్రడక్షన్ సన్నివేశం రామ్ చరణ్ కి భవిష్యత్తులో కూడా రావడం కష్టమే. హాలీవుడ్ లో కూడా ఇలాంటి టేకింగ్ తో ఫైటింగ్ సన్నివేశం ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు దానిని డైరెక్టర్ శంకర్ ‘గేమ్ చేంజర్’ చిత్రం లో రీ క్రియేట్ చేయబోతున్నాడా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. కారణం నిన్న సాయంత్రం విడుదల చేసిన పోస్టర్.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ కుర్చీ లో కూర్చొని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ పై సంతకాలు చేస్తూ ఉంటాడు. ఎదురుగా జనాలు గేట్స్ బద్దలు కొట్టుకొని లోపలకి వస్తూ ఉంటారు. ఇది చూడగానే అందరికీ #RRR ఇంట్రడక్షన్ సన్నివేశమే గుర్తుకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా, అలాగే ఎన్నికల అధికారి గా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. అది చెప్పేందుకే కౌంట్ డౌన్ పోస్టర్ గా దీనిని మూవీ టీం విడుదల చేసింది. ఎన్నికల అధికారిగా రామ్ చరణ్ ఒక రేంజ్ యాటిట్యూడ్ తో కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ పాత్ర సినిమాని మరోలెవెల్ కి తీసుకెళ్తుందట. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఈ రెండు పాటల్లోనూ థమన్ మార్క్ కంటే ఎక్కువగా శంకర్ మార్క్ కనిపించింది.

చిన్నప్పటి నుండి మనం శంకర్ సినిమాల్లోని పాటలు చూసి ఎంతో థ్రిల్ ని అనుభవించే వాళ్ళం. ఆ థ్రిల్లింగ్ అనుభూతి ‘గేమ్ చేంజర్’ చిత్రంలోని పాటలకు కూడా ఉన్నాయని లిరికల్ వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది. అదే విధంగా శంకర్ సినిమాలకు సంబంధించిన టీజర్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. కేవలం టీజర్ తోనే ఆయన సినిమా బజ్ ని మార్చేయగలడు. ‘గేమ్ చేంజర్’ టీజర్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందట. రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ టీజర్ కట్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఆ రేంజ్ లో టీజర్ ఉందో లేదో చూడాలి. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.