Hajj Yatra: పిట్టల్లా రాలుతున్న హజ్‌ యాత్రీకులు.. ఇప్పటికే వెయ్యి మంది మృత్యువాత! అసలేమైంది?

ఈ ఏడాది భారత్‌నుంచి 1.75 లక్షల మంది హజ్‌ యాత్రకు వెళ్లారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారతీయుల కోసం కేంద్రం ఏర్పాట్లు చేసింది.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 5:58 pm

Hajj Yatra

Follow us on

Hajj Yatra: తీవ్ర ఎండ, వేడి గాలులు ఈ ఏడాది హజ్‌ యాత్రకు బయల్దేరినవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. వడదెబ్బతో యాత్రీకులు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే 1000 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో భారతీయులు 98 మంది ఉన్నారు. ఈమేరు విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.

హజ్‌కు 1.75 లక్షల మంది
ఈ ఏడాది భారత్‌నుంచి 1.75 లక్షల మంది హజ్‌ యాత్రకు వెళ్లారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారతీయుల కోసం కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఏటా హజ్‌ యాత్రకు వెళ్లి 5 లక్షల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవ సంఖ్య ఇందుకు 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 10 దేశాలకు చెందిన 1,081 మంది మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

భారీగా ఉష్ణోగ్రతలు..
ఈ ఏడాది సౌదీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారంలో 51.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఈ ఏడాది 18.3 లక్షల మంది హజ్‌ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రీకులు 16 లక్షల మంది ఉన్నారు. ఇక సౌదీవాసులు 2 లక్షల మంది ఉంటారని అంచనా.