Dogs Attack: మహిళపై 15 కుక్కలు దాడి.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!

చిత్రపురి కాలనీలోని ఓ అపార్టుమెంటులో నివాసముండే మహిళా స్కూటీపై అక్కడికి వచ్చింది. వాహనం పార్కు చేసి వస్తుండగా అక్కడే ఉన్న 15 కుక్కలు ఆమె వెంటపడ్డాయి.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 6:37 pm

Dogs Attack

Follow us on

Dogs Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఒంటరిగా తిరిగి పిల్లలు, మహిళలపై సామూహికంగా దాడి చేస్తున్నాయి. తాజాగా మణికొండలోని చిత్రపురి కాలనీలో ఓ మహిళపై 15 కుక్కలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. సుమారు అరగంటపాటు ఆ మహిళ వాటితో పోరాటం చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఒంటరి పోరాటం..
చిత్రపురి కాలనీలోని ఓ అపార్టుమెంటులో నివాసముండే మహిళా స్కూటీపై అక్కడికి వచ్చింది. వాహనం పార్కు చేసి వస్తుండగా అక్కడే ఉన్న 15 కుక్కలు ఆమె వెంటపడ్డాయి. ఆమే భయంతో పరిగెత్తడంతో తరిమాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ధైర్యం చేసి కుక్కలు తనపై దాడి చేయకుండా వాటిని అదరగొట్టే ప్రయత్నం చేసింది. కాలి చెప్పులు తీసి కొట్టే ప్రయత్నం చేయడంతో కొంత దూరం వెళ్లిన కుక్కలు తర్వాత మళ్లీ ఆమె వెంటపడ్డాయి. అయినా సదురు మహిళ కుక్కలు తనను కరవకుండా అదరగొడుతూనే ముందుకు సాగింది. ఒక సందర్భంలో ఆమె కిందపడిపోయింది. దీంతో కుక్కలు ఒక్కసారిగా దాడికి యత్నించాయి. అయితే బాధితురాలు తన చేతిలో ఉన్న చెప్పుతో వాటిని హడలగొట్టింది.

స్థానికుల రాకతో..
సుమారు అరగంటపాటు సదరు మహిళ కుక్కలతో పోరాటం చేసింది. ఈ క్రమంలో అపార్టుమెంటువాసులు అటుగా రావడంతో వారు దాడికి యత్నిస్తున్న కుక్కలను హడలగొట్టారు. దీంతో అప్పటి వరకు ఆమె వెంటపడిన కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ దృశ్యాలన్నీ అపార్టుమెంటు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స్పందిస్తున్న నెటిజన్లు..
ఈ వీడియపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వీధికుక్కలు చెచ్చిపోతున్నా.. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఒంటరిగా మహిళలు, చిన్న పిల్లలు బయట తిరగలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. వీధికుక‍్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేశాయని కొంతమంది పేర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పలువురు పేర్కొంటున్నారు.

ఆహారం వేయడం కారణంగానే..
వీధి కుక్కలపై ప్రేమతో స్థానికులు వాటికి రోజు ఆహారం వేస్తున్నారని, దీంతో వీధి కుక్కలు అక్కడ పెరిగి పెద్దవై.. మనుషులపై దాడి చేస్తున్నాయని బాధిత మహిళ భర్త సీసీ ఫుటేజీ దృశ్యాన్ని సోషల్ ​మీడియాలో పోస్టు చేశారు. వీధికుక్కలపై ప్రేమ ఉంటే.. వాటిని దూరంగా తీసుకెళ్లి ఆహారం పెట్టాలని సూచించారు. స్థానికంగా ఆహారం పెట్టడం మనుషులకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. ఎవరూ వీధి కుక్కలకు అక్కడే ఆహారం పెట్టకూడాదని వేడుకున్నాడు.