Pakistan : సాధారణంగా సింహం అత్యంత బలమైన జంతువు. దాని దూరంగా చూస్తేనే భయం వేస్తుంది. భారీ ఆకారం.. పెరిగిన జుట్టుతో పది అత్యంత గంభీరంగా కనిపిస్తుంది. అందుకే జంతువుల్లో సింహం క్రూరత్వానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే సింహం జోలికి వెళ్లడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. అయితే ఓ యువకుడు టిక్ టాక్ వీడియో(Tik Tok video) కోసం చేయకూడని పనిచేశాడు. ఏకంగా సింహం బోనులోకి వెళ్ళాడు. చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ (Pakistan) దేశంలో ఈ సంఘటన జరిగింది.. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతాన్ని చిందిన మహమ్మద్ అజీమ్ టిక్ టాక్ వీడియోలు ఎక్కువగా చేస్తుంటాడు.. ఇతడు లాహోర్(Lahore) దగ్గరలో ఉన్న zoo కు వెళ్లాడు. అక్కడ ఓ బోనులో ఉన్న సింహంతో టిక్ టాక్ వీడియో తీయాలని భావించాడు. దానికోసం అతడు ఏకంగా సింహం ఉన్న బోనులోకి ప్రవేశించాడు. దీంతో ఆకలి మీద ఉన్న సింహం.. దొరికింది తడవుగా అతని మీద దాడికి దిగింది.. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. జంతు సంరక్షకుడు వచ్చి వెంటనే అతడి ని రక్షించారు. దీంతో అతని వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై పాకిస్తాన్ మంత్రి మరియం ఔరంగజేబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలకు ఆదేశించారు..ఆ జూ యజమాని బ్రీడింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పేర్కొన్నారు.. వాస్తవానికి టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా వేదికలలో ఈ జూ లోని జంతువులతో వీడియోలు ఫోటోలను నిషేధం ఉన్నప్పటికీ.. ఆ యువకుడు అలా చేయడం సంచలనం కలిగిస్తోంది.
ఒక్కసారిగా దాడి చేసింది
పాకిస్థాన్లో దుర్భరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జూ లో ఉన్న జంతువులకు కూడా అంతంతమాత్రంగానే ఆహారం పెడుతున్నారు. దీంతో అవి అర్ధాకలితో ఉంటున్నాయి. అయితే జూలోకి ఆ వ్యక్తి ప్రవేశించడంతో ఒకసారిగా సింహం దాడికి దిగింది. అతడిపై పంజా విసిరింది. ఆ పంజా తాకిడికి అతడు ఒకసారిగా కిందపడ్డాడు. తన బలమైన దంతాలతో అతడిని చంపడానికి సింహం ప్రయత్నించగా.. అతడు ప్రాణ భయంతో కేకలు వేశాడు. దీంతో ఒక్కసారిగా జూ బయట ఉన్న సంరక్షకులు అప్రమత్తమయ్యారు. ప్రమాద గంటి కలను మోగిస్తూ సింహాన్ని దారి మరల్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అతడిని వెంటనే బయటికి తీసుకొచ్చారు. ప్రత్యేకమైన అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడికి రక్తం తీవ్రంగా కారింది. దీంతో అత్యవసర వైద్య విభాగం లో అతడికి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. రోజులు గడిస్తేనే అతని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తామని వైద్యులు వివరిస్తున్నారు.