Monalisa Bhonsle : గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఒక అమ్మాయి కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి తన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వుతో మహా కుంభమేళాకు వచ్చిన ప్రజలను తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ప్రస్తుతం ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాలలో వైరల్ అయిపోతుంది. అంతేకాదు సోషల్ మీడియా ఎంతోమందికి జీవితాన్ని కూడా ఇచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాలు నటనపై ఆసక్తి ఉండి సినిమా రంగంలోకి రావాలని ప్రయత్నించే వారికి బాగా ఉపయోగపడింది. ఇప్పటివరకు సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటీనటులు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ ఫిలిం లలో నటించి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇదే క్రమంలో ఒక తేనె కళ్ళ సుందరి ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాటుక దిద్దినటువంటి అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఉన్న ఈ అమ్మాయి ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముతున్న ఈ అమ్మాయిని చూసి ఫిదా అయినా కొందరు ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఓవర్ నైట్ లో బాగా ఫేమస్ అయిపోయింది. ఈమె పేరు మోనాలిసా.
మధ్యప్రదేశ్ ఇండోర్ కు సంబంధించిన మోనాలిసా మహా కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే తన తేనె కళ్ళు, అందానికి ఫిదా అయిన కొంతమంది ఆమె ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తాజాగా ఈమె రూపం పూర్తిగా మారిపోయింది. వైరల్ అవుతున్న ఆమె ఫోటోలను చూసి మోనాలిసాకు బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.ఈమె చిన్నప్పటి నుంచి దండలు అమ్ముకుంటూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. కుంభమేళాలో కూడా తన కుటుంబంతో కలిసి దండలు అమ్ముతున్న ఈ అమ్మాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ అవడంతో ఈమెకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
దర్శకుడు సనోజ్ మిశ్రా త్వరలోనే మోనాలిసా ను కలవనున్నారని వార్త వినిపిస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడు సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా రూపం మరియు ఆమె అమాయకత్వం చూసి తాను ఫిదా అయ్యానని అందుకే తనని డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నానని ఈ సినిమాలో రైతుకూతురు పాత్రలో మోనాలిసా సెట్ అవుతుందని త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి మోనాలిసా ను కలవనున్నట్లు తెలిపారు. ఆమెకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు ఇక ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.