Homeఅంతర్జాతీయంMystery Case: 26 ఏళ్లుగా పోలీసులు ఛేదించలేకపోయిన హత్య మిస్టరీ.. చివరకు అదిరిపోయే ట్విస్ట్‌

Mystery Case: 26 ఏళ్లుగా పోలీసులు ఛేదించలేకపోయిన హత్య మిస్టరీ.. చివరకు అదిరిపోయే ట్విస్ట్‌

Mystery Case: సమాజంలో నిత్యం రకరకాల క్రైంలు జరుగుతున్నాయి. రకరకాల క్రైం వార్తలు చదువుతున్నాం.. చూస్తున్నాం. కానీ ఇలాంటి క్రైం ఎక్కడా జరిగి ఉండదు. ఇందులో ఉన్న ట్విస్టులు ఎందులోనూ ఉండవు. ఇది జపాన్‌లో జరిగింది. జపాన్‌ నాగోయాలో 1999లో జరిగిన హత్య కేసు 26 సంవత్సరాల తర్వాత 2025లో హంతకులు ఎవరో తెలిసింది. అనేక ట్విస్ట్‌లతో కూడిన ఈ హత్యను పోలీసులు ఛేదించలేదు. హంతకులే చివరకు హత్య చేసినట్లు అంగీకరించడం మరో టిæ్వస్ట్‌. ఏం జరిగిందంటే.. […]

Mystery Case: సమాజంలో నిత్యం రకరకాల క్రైంలు జరుగుతున్నాయి. రకరకాల క్రైం వార్తలు చదువుతున్నాం.. చూస్తున్నాం. కానీ ఇలాంటి క్రైం ఎక్కడా జరిగి ఉండదు. ఇందులో ఉన్న ట్విస్టులు ఎందులోనూ ఉండవు. ఇది జపాన్‌లో జరిగింది. జపాన్‌ నాగోయాలో 1999లో జరిగిన హత్య కేసు 26 సంవత్సరాల తర్వాత 2025లో హంతకులు ఎవరో తెలిసింది. అనేక ట్విస్ట్‌లతో కూడిన ఈ హత్యను పోలీసులు ఛేదించలేదు. హంతకులే చివరకు హత్య చేసినట్లు అంగీకరించడం మరో టిæ్వస్ట్‌.

ఏం జరిగిందంటే..
1999 సెప్టెంబర్‌ 2న నాగోయా వెస్ట్‌ వార్డ్‌ అపార్ట్‌మెంట్‌లో 32 ఏళ్ల నమికో తకాబాను గొంతులో కత్తితో పొడిచి చంపేశారు. అప్పుడు ఆమెకు 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయనను ఏమీ చేయలేదు. బయటకు వెళ్లిన భర్త తకాబా షిన్‌యా ఇంటికి వచ్చి దృశ్యం చూసి షాక్‌ అయ్యాడు వెంటనే పోలీసులకు కాల్‌ చేశాడు. స్థలంలో ఆ టైప్‌ రక్తం, గాయపడిన మహిళ వివరాలు, కత్తి దొరికాయి.

సుదీర్ఘ విచారణ..
పోలీసులు 26 ఏళ్లలో 5 వేల మందిని విచారణ చేశారు. లక్ష మంది అధికారులను ఉపయోగించారు. 2015, 2020లో సందేహాస్పద మహిళల స్కెచ్‌లు విడుదల చేశారు. మరోవైపు తకాబా హత్య జరిగిన ఇంటికి 26 ఏళ్లుగా అద్దె చెల్లిస్తూ వచ్చాడు. కొత్తగా ఎవరైనా వస్తే అక్కడి ఆధారాలు చెదిరపోతాయని ఇలా చేశాడు. అనేకచోట్ల విచారణ చేశాడు. స్నేహితులు, బంధువులను ఆరా తీశాడు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. హంతకులు ఎవరో చెబితే నగదు బహుమతి ఇస్తానని ప్రకటించాడు.

షాకింగ్‌ ట్విస్ట్‌..
2025 అక్టోబర్‌లో 69 ఏళ్ల కుమికో యాసుఫుకు హత్య తానే చేసినట్లు అంగీకరించింది. ఈమె ఆమె తకాబా స్కూల్‌మేట్‌. ఇంటర్‌లో ప్రేమ ప్రతిపాదన తిరస్కరణ కోపంతో భార్యను లక్ష్యంగా చేసుకుంది. 26 ఏళ్లు భయంతో ’నిత్య నరకం’ అనుభవించి, నిజం ఒప్పుకుంది. మార్చి 5న ఇండిక్ట్‌ చేశారు.

తకాబా షాక్‌లో ఉన్నాడు.’ఎన్నోసార్లు ఆమెతో మాట్లాడాను, ప్రయాణాలు చేశాను, ఊహించలేకపోయాను’ అన్నాడు. ఈ కేసు జపాన్‌లో దీర్ఘకాల దర్యాప్తులకు చిహ్నం; ప్రేమ కోపం దీర్ఘ శిక్షగా మారడం హదయవిదారకం. పోలీసు పట్టుదల ప్రజల ఆశీస్సులు పొందాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper