Ajith Kumar: సినిమాలకు బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది అంటే , అందుకు ముఖ్య కారణం మేకింగ్ కాస్ట్ కాదు , హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్స్. ఒక్కో స్టార్ హీరో 100 కోట్ల రూపాయలకు అసలు తగ్గడం లేదు. ఓటీటీ బిజినెస్ బాగా ఉన్నప్పుడు , వాళ్ళు కోరింత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ వెనకడుగు వేసేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం , హీరోలు డిమాండ్ చేసేంత డబ్బులు ఇవ్వడానికి ఏ నిర్మాత కూడా సిద్ధంగా లేరు. అందుకు బెస్ట్ ఉదాహరణ తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కంటే గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో ఈయన. కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల, తన రేంజ్ కి తగ్గ బాక్స్ ఆఫీస్ ని ఇప్పటి వరకు చూడలేదు. ఆయన గత చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.
భారీ అంచనాల నడుమ విడుదలై డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో పక్క ఈయనకు సమానమైన స్టార్ స్టేటస్ ఉన్నటువంటి విజయ్ , ‘జన నాయగన్’ లాంటి ఫ్లాప్ చిత్రానికి కూడా 300 కోట్ల గ్రాస్ పెట్టాడు. విజయ్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి , కోరినంత రెమ్యూనరేషన్ అడిగితే ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుండి ఆయన తీస్తున్న సినిమాలు అలాంటివి మరి. కానీ అజిత్ కి ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ తో కలిసి ‘డేర్ డెవిల్’ అనే చిత్రం చేయబోతున్నాడు అజిత్. ఈ సినిమాని ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలని చూసింది.
కానీ అజిత్ వాళ్ళ బ్యానర్ లో సినిమా చేయడానికి 120 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అడిగాడట. దీంతో వాళ్ళు వర్కౌట్ అవ్వదని ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత పలు టాప్ నిర్మాణ సంస్థలు కూడా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాయి. కానీ అజిత్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి వెనక్కి తగ్గారు. దీంతో ఎప్పుడో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా , ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది ఈ చిత్రం. దీంతో అజిత్ నే స్వయంగా నిర్మాత అవతారం ఎత్తాడు. ‘బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్స్’ అనే సంస్థ ని ప్రారంభించి , అజిత్ స్వయంగా నిర్మించబోతున్నాడు. కానీ నిర్మాతగా మాత్రం ఆయన సతీమణి షాలిని కి క్రెడిట్స్ ఇచ్చాడు. నిన్న ఈ సినిమాని గ్రాండ్ గా ప్రకటించారు. మరి ఈ చిత్రం తో అజిత్ భారీ కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.