Homeఅంతర్జాతీయంMacron Meloni Hug: మాక్రాన్‌– మెలోనీ ఆలింగనం.. బుగ్గలపై ముద్దు కూడా.. వీడియో వైరల్‌

Macron Meloni Hug: మాక్రాన్‌– మెలోనీ ఆలింగనం.. బుగ్గలపై ముద్దు కూడా.. వీడియో వైరల్‌

Macron Meloni Hug: ప్రేమకు ఎల్లలు లేవంటారు. సామాన్యులు కూడా విదేశీ యువతులను ప్రేమించి పెళ్లి చేసుకుంటాయి. అందుకే యువరాజులు, రాణులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆస్తులను వదులుకుని వెళ్లిపోతున్నారు. అయితే తాజాగా ఓ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పారిస్‌లో యూరోపియన్‌ యూనియన్‌ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ఫ్రెంచ్‌ అధ్యక్వుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మధ్య జరిగిన అకస్మాత్తు ఆలింగనం సోషల్‌ మీడియాలో భారీ చర్చను రేకెత్తించింది. మాక్రాన్‌ ఆమెను గట్టిగా హత్తుకుని రెండు బుగ్గలపై ముద్దులు పెట్టిన వీడియో వేలాది వ్యూస్‌ సాధించింది.

సంఘటన నేపథ్యం..
అధికారిక స్వాగత కార్యక్రమంలో మెలోనీ కారు దిగగానే మాక్రాన్‌ సాధారణ షేక్‌హ్యాండ్‌తో ప్రారంభించి, అకస్మాత్తుగా ఆమెను ఆలింగనం చేశారు. ఆమె భుజాలపై చేతులు వేసి రెండు వైపులా బుగ్గలపై ముద్దు పెట్టారు. మెలోనీ కళ్లు పొడిగిపోయి, కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపించింది. తర్వాత ఇద్దరూ నవ్వుకుని కొనసాగారు.

ఆలింగనం ట్రెడిషన్‌..
ఫ్రాన్స్‌లో ‘La Bise’ (గాల్‌ కిస్‌) సామాజిక స్వాగతంగా సాధారణం.– రెండు లేదా నాలుగు బుగ్గలపై ముద్దు. ఇటలీ, ఇతర లాటిన్‌ దేశాల్లో కూడా ఇది సంప్రదాయం. అయితే అధికారిక డిప్లొమాటిక్‌ కార్యక్రమాల్లో ఈ స్థాయి శారీరక సన్నిహితత్వం అసాధారణం. మెలోనీ రైట్‌–వింగ్‌ నాయకురాలిగా తన స్వతంత్ర ఇమేజ్‌ను కాపాడుకుంటుంది కాబట్టి ఈ దృశ్యం ఆమెకు అసౌకర్యంగా ఉండవచ్చు.

నెటిజన్ల ప్రతిస్పందన..
మెలోని బుగ్గపై మక్రాన్‌ ముద్దు వీడియో గంటల వ్యవధిలో లక్షల వ్యూస్‌ వచ్చాయి. దీనిపైనెటిజన్లు స్పందించారు. యూరోపియన్‌ సంస్కృతి, స్నేహపూర్వకం అని, ‘మెలోనీ స్వీకరించింది అని కొందరు కామెంట్‌ చేశారు. ప్రొఫెషనల్‌ సరిహద్దులు దాటారు అని కొందరు. డిప్లొమటిక్‌ రొమాన్స్‌ అంటూ కొందరు హాస్యాస్పదంగా వ్యాక్యానించారు. మక్రాన్‌ పాపులారీటీ స్టంట్‌గా కొందరు పేర్కొన్నారు.

రాజకీయ నేపథ్యం..
మెలోనీ (బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ) యూరోప్‌లో అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాలు. మాక్రాన్‌ (సెంట్రిస్ట్‌)తో ఈయూ పాలసీలపై సన్నిహిత సహకారం ఉంది. ఈ దృశ్యం వారి వ్యక్తిగత సంబంధాన్ని హైలైట్‌ చేసినా, జెండర్‌ సున్నితత్వాలు, #MeToo ఉద్యమం సందర్భంలో వివాదాస్పదం. ఇద్దరూ అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు, కానీ మెలోనీ తన స్వతంత్ర ఇమేజ్‌ను రక్షించుకోవడానికి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టవచ్చు.

ఈ ఘటన డిప్లొమసీలో శారీరక సంబంధాల సరిహద్దులపై చర్చలు పెంచుతుంది. యూరోపియన్‌ నాయకులు భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు పాటించవచ్చు. మెలోనీ పాపులరిటీకి పాజిటివ్‌/నెగటివ్‌ ప్రభావం చూపవచ్చు. ఫ్రాన్స్‌–ఇటలీ సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular