Nobel Prize 2023: కోవిడ్ మహమ్మారితో యావత్ ప్రపంచం అల్లకల్లమైపోయింది. లక్షల మంది కన్నుమూశారు. వేలాదిమంది వివిధ రకాల రుగ్మతల బారిన పడి నరకం చూశారు.. ఆర్థిక లావాదేవీలు లేక చాలా సంస్థలు మూతపడ్డాయి. లక్షల మంది పొట్ట చేత పట్టుకుని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ చాలా రంగాలు ఇంకా కోలుకోలేదు. కొన్ని కొన్ని రంగాలు అయితే శాశ్వతంగా మూతపడ్డాయి. అయితే ఇంతటి విపత్తు కారణమైన కోవిడ్ నివారణకు మొదట్లో ఒక శాశ్వత చికిత్స అంటూ లేదు. ఈ కోవిడ్ నివారణకు ప్రపంచంలో కంటే భారతదేశం లోనే ముందుగానే వ్యాక్సిన్ తయారైంది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటిలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ ఈ ఏడాది వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. కోవిడ్ వైరస్ కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు వీరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక చేసిన కమిటీ పేర్కొంది.
కాటలిన్ స్వస్థలం హంగరీ కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన 13వ మహిళగా గుర్తింపు పొందారు. అమెరికన్ శాస్త్రవేత్త వెయిస్ మన్ తో కలిసి ఆమె సాధించిన పరిశోధనల వల్ల ఎంఆర్ఎన్ఏ.. రోగ నిరోధక వ్యవస్థతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కాటలిన్ ప్రస్తుతం అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీతో పాటు, హంగరిలోని సెగెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. బయో ఈఎన్ టెక్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ.. ఫైజర్ కంపెనీ తో కలిసి కోబిడ్ 19 టీకాలు అభివృద్ధి చేసింది. వెయిస్ మెన్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కాటలిన్ 1970లో హంగరిలో కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అమెరికా వలస వెళ్లారు. అప్పటికే ఎంఆర్ఎన్ఏ పై పరిశోధనలు చాలా కొత్త. అవధులుగా అమెరికాలోని టెంపుల్ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత పెన్సిల్వేనియా వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్లో పరిశోధనలు మొదలుపెట్టారు. ఏంఆర్ఎన్ఏ పరిశోధనలపై విశ్వవిద్యాలయ అధికారుల్లో తొలుత ఆసక్తి వ్యక్తమైనప్పటికీ.. ఆ తర్వాత నీరుగారింది. వ్యాధులపై పోరుకు ఈ సాంకేతికతను వాడవచ్చు అనే కాటలిన్ ప్రతిపాదనకు తిరస్కరణలే ఎదురయ్యాయి. ఈ పరిశోధనకు నిధులు సమకూర్చడం కొట్టుకునే వ్యవహారం అని వర్సిటీ అధికారులు తేల్చి చెప్పేశారు.
1995లో అధికారులు ఆమె హోదాను కూడా తగ్గించారు. అదే సమయంలో మే క్యాన్సర్ బారిన పడ్డారు. ఇన్ని కష్టాల నుంచి ఆమె త్వరగా నే బయటపడ్డారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వెయిస్ మన్ తో పరిశోధనలు కొనసాగించిన కాటలిన్.. ఉమ్మడిగా ఒక విధానాన్ని కనుగొన్నారు. అందులో వారు ఆర్ ఎన్ ఏ లోని న్యూక్లియర్ సైడ్ బేస్ ను పూర్తిగా మార్చేశారు. ఫలితంగా ఎంఆర్ఎన్ఏ కు మన రోగ నిరోధక స్పందన తొలగిపోయింది. దీనిపై 2005లో కాటలిన్, వెయిస్ మన్ లు ఒక పరిశోధన పత్రం ప్రచురించారు. అప్పట్లో ఇది అంతగా గుర్తింపు పొందనప్పటికీ .. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీటి పరిశోధనలు కీలకపాత్ర పోషించాయి. ఫలితంగా 2020 చివరిలో రెండు ఎంఆర్ఎన్ఏ టీకాలకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమే కాకుండా.. కోట్లాదిమంది ప్రాణాలు కాపాడగలిగాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నోబెల్ కమిటీ పురస్కారాన్ని ప్రకటించింది.
ఏమిటీ ఈ ఎంఆర్ఎన్ఏ?
సంప్రదాయ టీకాలు తయారీ విధానంలో లక్షిత వైరస్ లు లేదా అందులోని భాగాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుద్ధి చేసి తదుపరి దశలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో సజీవ లేదా బలహీనపరిచిన వైరస్ లను శరీరంలోకి చెప్పించాల్సి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ విధానం ఎందుకు పూర్తి విభిన్నమైనది. లక్షిత వైరస్ లోని ఎంపిక చేసిన భాగాన్ని ఉత్పత్తి చేయాలంటూ మన కణాలకు ఆదేశాలు అందులో ఉంటాయి. దాన్ని మన కణాలు “చదివి” ప్రోటీన్ తయారుచేస్తాయి. అంటే మన శరీరమే ఒక మినీ టీకా కర్మాగారంగా మారిపోతుంది. అలా ఉత్పత్తి అయిన ప్రోటీన్ ఆధారంగా మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించి.. సంబంధిత ప్రొటీన్లను అడ్డుకునే ఈ యాంటీ బాడీలు, ఇతర ప్రత్యేక కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో వైరస్ మళ్లీ సోకితే స్పందించి సంబంధిత ప్రోటీన్లను అడ్డుకునే ప్రతికారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో వైరస్ సోకినప్పుడు వెంటనే స్పందించి.. ఇన్ఫెక్షన్ కు అడ్డుకట్ట వేసేలా ముందే శిక్షణ పొందుతుంది. అయితే ఏంఆర్ఎన్ఏ టీకా తయారికి వైరస్ అవసరం అసలు ఉండదు. అయితే, ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ ను చొప్పించడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రతి చర్య తలెత్తుతుంది. ఇది ఎంఆర్ఎన్ఏ ను నాశనం చేస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించే విధానాన్ని కాటలిన్, వెయిస్ మన్ కనుగొన్నారు. నోబెల్ బహుమతి సాధించారు.