Yashasvi Jaiswal: ప్రస్తుతం ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా తయారయింది. మొన్నటి వరకు రోహిత్ శర్మ సారధ్యం లో ఆడుతున్న టీం మాత్రమే చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అనుకున్నాం కానీ బీసీసీఐ ఏషియా గేమ్స్ కోసం ఇండియన్ టీం బి ని సెలెక్ట్ చేయడం జరిగింది.నిజానికి ఈ టీం మీద మొన్నటి దాక అందరికి చాలా కన్ ఫ్యూజన్స్ ఉండేవి… వీళ్లు ఎలా ఆడుతారు చైనా వెళ్లి ఇండియా పరువు తీస్తారా..? అంటూ వీళ్ల మీద చాలా రకలైన సందేహాలు ఉండేవి దానికి తగ్గట్టు గా చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఇవాళ్ల నేపాల్ మీద ఆడిన మ్యాచ్ లో ఇండియా టీం తన సత్తా ఏంటో ప్రూవ్ చేసింది.
అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో చేలరేగి ఆడిన యశస్వి జైశ్వాల్ సెంచరీ చేసి అద్భుతాన్ని క్రియేట్ చేసాడు.నిజానికి ఆయన గత ఐపీఎల్ సీజన్ నుంచి కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. టెస్ట్ డెబ్యూ మ్యాచ్ లో వెస్టిండీస్ టీం మీద సెంచరీ చేసి అందరిని దృష్టిని ఆకర్షించిన జైశ్వాల్ ఏషియన్ గేమ్స్ కోసం సెలెక్ట్ అవ్వడం జరిగింది.ఇక ఇక్కడ కూడా మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి తన మార్క్ స్టామినా ఏంటో చైనా వేదిక గా ప్రపంచానికి తెలియజేసాడు.ఇక బిసిసిఐ ఒక వంతుకు ఐపీల్ నిర్వహిస్తుంది కూడా మన ఇండియన్ టీం కి చాలా మంచిది అవుతుంది ఎందుకంటే చాలా మంది టాలెంట్ ఉన్న ప్లేయర్లు ఈ ఐపీల్ వల్లనే వెలుగులోకి వస్తున్నారు.ఒకరు ఇద్దరు అని కాకుండా ఇండియా లో ఇంత మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారా అని ప్రపంచ దేశాలు సైతం అవాక్కయ్యేలా ఇండియన్ టీం తయారవుతుంది…
ఇక జైశ్వాల్ గురించి చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ లో పుటిన జైశ్వాల్ తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుంచి తనని చూసి ఇప్పడూ ప్రపంచం మొత్తం గర్వపడేలా క్రికెట్ ఆడుతూ ఇండియన్ టీం ని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకొని మరి ఆడుతున్నాడు.ఫార్మాట్ ఏదైనా ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేయడం జైశ్వాల్ కి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి.జైశ్వాల్ లాంటి ప్లేయర్ ఫ్యూచర్ లో ఇండియన్ క్రికెట్ టీం లో కీలక ప్లేయర్ కాబోతున్నాడు.ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ టీం తరుపున ఆడుతున్న జైశ్వాల్ ఆ టీం కి కూడా ఇప్పటి వరకు చాలా విజయాలను అందించాడు.ఇక 2023 ఐపీల్ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్లలో టాప్ త్రి లో నిలిచాడు.అంతే కాకుండా ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా గెలవాలి అనే ఒక దృఢ సంకల్పం తో ఆడుతాడు.స్వతహాగా జైశ్వాల్ ధోని అభిమాని కావడం ఆయన బ్యాటింగ్ చూస్తూనే జైశ్వాల్ క్రికెట్ నేర్చుకొవడం కూడా జరిగింది.ఇక జైశ్వాల్ ఇండియన్ టీం కి చాలా సంవత్సరాల పాటు తన సేవలు అందిస్తాడు అని చెప్పడం లో ఎంత మాత్రం సందేహం లేదు.
తను క్రికెట్ నేర్చుకోవాలి అనుకున్న టైం లో ఆయన దగ్గర డబ్బులు లేకపోతే క్రికెట్ అకాడమీ బయట ఒక పానీ పూరి బండి పెట్టుకొని అవి అమ్ముతూ వచ్చిన డబ్బులతో క్రికెట్ అకాడమీ కి ఫీజు పే చేస్తూ ఉండేవాడు.అలా ఆయన కష్టపడి క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు.ఏదైనా మ్యాచ్ ఆడాలంటే నైట్ మొత్తం పానీ పూరి అమ్మి మార్నింగ్ షాప్ క్లోజ్ చేసి మ్యాచ్ ఆడేవాడు అలా కష్టపడి ఆడాడు కాబట్టే ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు…ఎప్పటికైనా ఇంటెర్నేషనల్ మ్యాచ్ లకి క్రికెట్ ఆడాలి అనుకున్నాడు ప్రస్తుతం ఆడుతూ అద్భుతాలు చేస్తున్నాడు…ఇప్పుడు జరుగుతున్నా ఏషియన్ గేమ్స్ లో నేపాల్ లాంటి టీం కి చుక్కలు చూపించి వాళ్ళ బౌలర్లకు చెమటలు పట్టించాడు…ఇక జైశ్వాల్ అటతీరు పట్ల బిసిసిఐ కూడా చాలా సంతృప్తి గా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక తొందర్లోనే ఆయన మెయిన్ టీం కి కూడా ఆడే అవకాశం అయితే ఉంది…