Kamala Harris: అమెరికా అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్‌..? ప్రీపోల్స్‌లో ట్రంప్‌కు గట్టి పోటీ!

తాజాగా సీఎన్‌ఎన్‌పోల్‌ ప్రకారం.. నమోదైన ఓట్లలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు 47 శాతం ఓట్లు రాగా, కమలా హ్యారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళా ఓట్లు 50 శాతం కమలాకే పోలయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : July 3, 2024 12:49 pm

Kamala Harris

Follow us on

Kamala Harris: ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ వ్యవహారమే కారణం. ఇటీవల రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్‌ స్ట్రక్‌ కావడం, వయోభార సమస్యలు డెమొక్రటిక్‌ అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్‌ అభ్యర్థి మార్పుపై చర్చ జరుగుతోంది. కొత్త అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు భారత సంతతి మహిళ కమలా హ్యారీస్‌న బరిలో దింపాలని పలువురు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఎవరుంటారన్న చర్చ మొదలైంది.

ప్రీపోల్స్‌లో ట్రంప్‌కు గట్టి పోటీ..
ఇదిలా ఉంటే.. తాజాగా సీఎన్‌ఎన్‌పోల్‌ ప్రకారం.. నమోదైన ఓట్లలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు 47 శాతం ఓట్లు రాగా, కమలా హ్యారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళా ఓట్లు 50 శాతం కమలాకే పోలయ్యాయి. ఇదే సమయంలో బైడెన్‌కు 44 శాతం ఓట్లు వచ్చాయి. డెమొక్రటిక్‌ పార్టీకే చెందిన మరో మహిళా నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఓబామా భార్య మిచెల్లి ఒబామాకు 37 శాతం ఓట్లు మాత్రమే రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రంప్‌–బైడెన్‌ డిపేట్‌పై చర్చ..
ఇదిలా ఉంటే అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అధ్యక్షుడు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ప్రంప్‌ మధ్య జరిగిన తొలి ఓపెడ్‌ డిబేట్‌ ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్‌ను ఎదుర్కొనడంలో బైడెన్‌ విఫలమయ్యాడని డెమొక్రటిక్‌ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోటీలో ఉంటారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది.

తడబాటుపై బైడెన్‌ వివరణ..
ఇదిలా ఉంటే డిబేట్‌లో తాను ఎందుకు స్ట్రక్‌ అయ్యానో క్లారిటీ ఇచ్చాడు బైడెన్‌. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు వదేశీ పర్యాటనలకు వెళ్లాలని తెలిపారు. ఈ పర్యటన కారణంగా వచ్చిన అలసటతోనే వేదికపై తడబడ్డానని వెల్లడించారు.ఈ కారణంగానే ట్రంప్‌క దీటుగా సమాధానం చెప్పలేకపోయానని వెల్లడించారు. చర్చలో ఇంకా ధాటిగా మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు.