https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ మద్యం తాగుతాడా..? వాట్సాప్ AI మైండ్ బ్లోయింగ్ ఆన్సర్!

అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం భారీ కాయుడిగా తయారయ్యాడు. కఠిన కసరత్తులు చేసి కండలు పెంచాడు. అలాగే శివుడు పాత్ర కోసం సన్నబడ్డాడు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో కూడా ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంటుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 3, 2024 / 12:44 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: ప్రభాస్ ఛార్మింగ్ హీరో. డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ లుక్ చూసి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయారు. ఆ మూవీలో పక్కా లవర్ బాయ్ రోల్ చేశాడు ప్రభాస్. నిజానికి అది తన ఇమేజ్ కి భిన్నమైన రోల్. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన డార్లింగ్ సూపర్ హిట్. కామెడీ, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ పండించిన ప్రభాస్ నయా సెక్షన్స్ కి దగ్గరయ్యాడు. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాల్లో కూడా ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. బాహుబలి కోసం ప్రభాస్ తన బాడీ మీద ప్రయోగాలు చేశాడు.

    అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం భారీ కాయుడిగా తయారయ్యాడు. కఠిన కసరత్తులు చేసి కండలు పెంచాడు. అలాగే శివుడు పాత్ర కోసం సన్నబడ్డాడు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో కూడా ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంటుంది. సాహూ లో ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆయన ముఖంలో మునుపటి గ్లో లేదు. డ్రై అయిపోయిన పెదాలు, కాంతి లేని కళ్ళతో తీవ్ర నిరాశకు గురి చేశాడు.

    సాహో మూవీలో ప్రభాస్ డైలాగ్స్ కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన గొంతు బొంగురుగా తయారైంది. ప్రభాస్ అలా మారడానికి మద్యం అలవాటే కారణం అనే పుకారు తెరపైకి వచ్చింది. మద్యానికి బానిసైన ప్రభాస్ తన అందం, ఆరోగ్యం పాడు చేసుకున్నాడనే వాదనలు వినిపించాయి. సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఏ చిత్రంలో కూడా ఆయన మునుపటి గ్లామర్ రాబట్టలేకపోయాడు.

    ఈ క్రమంలో ప్రభాస్ కి నిజంగా మద్యం అలవాటు ఉందా? అనే సందేహం అందరిలో ఉంది. ఈ ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆసక్తికర సమాధానం చెప్పింది. ఈ మధ్య వాట్సాప్ లో వచ్చిన నయా ఫీచర్ మెటా AI ని అడిగితే… ”ప్రభాస్ కి గతంలో ఆల్కహాల్ అలవాటు ఉండేదని సమాచారం. ఇంకా ఆయన తాగుతున్నాడా లేదా అనేది అస్పష్టం. 2010లో తండ్రి మరణం తర్వాత ఆల్కహాల్ కి అలవాటు పడినట్లు ప్రభాస్ చెప్పారు. ఆయనకు లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనే పుకార్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రభాస్ చెడు అవాట్లు వదిలేసి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారట”, అని చెప్పింది.