https://oktelugu.com/

Hamas : బంకర్లలో నోట్ల కట్టలు.. బంగారం గుట్టలు..ఇదీ హమాస్ స్థావరాల్లో కనిపించిన సంచలన వాస్తవాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన తర్వాత ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది హెజ్‌బొల్లా. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపుణులతో దాడిచేసింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 22, 2024 / 04:32 PM IST

    Hamas

    Follow us on

    Hamas :  పశ్చిమాసియాలో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితి కనబడడం లేదు. తమ సరిహద్దులపై దాడిచేసి తమ వారిని బందీలుగా పట్టుకున్న హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ 2023 అక్టోబర్‌ 7న యుద్ధం మొదలు పెట్టింది. పాలస్తీనాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాదాపు ఆరు నెలల పోరాటంతో చాలా మంది బందీలను విడిపించింది. ఈ క్రమంలో ఇరాన్‌లో తలదాచుకున్న హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌ను మట్టుపెట్టింది. దీంతో లెబనాన్‌లోని మరో ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాతోపాటు, ఇరాన్‌ కూడా దీనిని తీవ్రంగా ఖండించాయి. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాయి. ఈ క్రమంలో హమాస్‌తోపాటు హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు మొదలు పెట్టింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలను టార్గెట్‌చేసింది. దీంతో యుద్ధం తీవ్రమైంది. మరోవైపు ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపుణులతో దాడిచేసింది. అయితే అమెరికా హెచ్చరికలతో వెనక్కు తగ్గింది. కానీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించి ఏడాది కావొస్తున్నా దాడులు ఆపడం లేదు. ఇటీవల దాడులను ఉధృతం చేసింది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఈ మిలిటెంట్‌ గ్రూపులోని ఓ సీక్రెట్‌ బంకర్‌ను గుర్తించారు. ఈ బంకర్‌ ఓ ఆస్పత్రి కింద ఉంది. దీంతో భారీగా డబ్బు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) విడుదల చేసింది.

    వివరాలు వెల్లడి..
    బంకర్‌లో డబ్బు, బంగారం గుర్తించిన వివరాలను ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ వెల్లడించారు. హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై వరుసగా దాడు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేయగా అందులో లక్షల డాలర్ల నగదు, బంగారం గుర్తించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడికి ఈ నగదు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఈ మలిటెంట్‌ గ్రూప్‌నకు చెందిన బీరుట్‌ నడిబొడ్డున మరో రహస్య బంకర్‌ ఉందని తెలిపారు. అల్‌ సాహెల్‌ ఆస్పత్రి కింద ఉన్న ఆ బంకర్‌లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగార ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఇంకా దాడి చేయలేదని వెల్లడించారు.

    500 మిలియన్‌ డాలర్ల నగదు..
    మరో బంకర్‌లో 500 మిలియన్‌ డాలర్ల నగదు(భారత కరెన్సీలో 4,200 కోట్లు) ఉన్నట్లు తెలిపారు. బంగారం గుట్టలుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని హగారి వెల్లడించారు. బంకర్‌ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను చూపించారు. ఈ ప్రాంతంపై దృష్టి పెట్టామన్నారు. తమ యుద్ధం హెజ్‌బొల్లాతో మాత్రమే అని, లెబనీస్‌ పౌరులతో కాదని స్పష్టం చేశారు. బంకర్‌ ఉన్న ఆస్పత్రిపై దాడి చేయమని పేర్కొన్నారు. ఆస్పత్రిని ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు.

    ఆర్థికసాయం చేయొద్దు..
    ఇదిలా ఉంటే.. హెజ్‌బొల్లాకు ఎవరూ ఆర్థికసాయం చేయొద్దని ఇజ్రాయెల్‌ సూచించింది. లెబనాన్‌ వ్యాప్తంగా ఉన్న అల్‌ ఖర్ధ్‌ అల్‌ హసన్‌ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. అల్‌ ఖర్ధ్‌ అల్‌ హసన్‌ అనేది లైసెన్స్‌ లేని గ్రే–మార్కెట్‌ బ్యాంకు. హెజ్‌బొల్లాకు నిధులు సమకూరుస్తుంది. లెబనాన్‌ వ్యాప్తంగా దీనికి 30 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇందుల సంగం బీరుట్‌లోని అత్యంత రద్దీ 6పాంతంలో ఉన్నాయి.