tomatoes : టమాటల వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. అంతేకాదు నెగిటివ్ కూడానండోయ్..

ప్రతి రాష్ట్రంలో కూడా టమాట తింటారు. భారతదేశంలో అందరికీ లభించే కూరగాయల్లో ముందుగా టమాటనే ఉంటుంది. ఇది లేకుండా ఏ కూర తయారుకాదు అనే రేంజ్ లో చాలా మంది వంట చేస్తుంటారు. మొన్నటివరకు దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోయాయి. ఇప్పుడు కూడా సమస్య అదే మాదిరి ఉంది. కానీ కొన్ని సార్లు కి.లో 120 కూడా పలికింది టమాట. ప్రస్తుతం రూ. 50 కి కిలో గా మార్కెట్ లో లభిస్తుంది. అయినా సరే టమాట డిమాండ్ మాత్రం తగ్గదు. టమాటాల్లో విటమిన్ ఏ, విటమిన్ కే,విటమిన్ సి,మాంగనీస్, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రొటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి. టమాటాను ప్రతిరోజు తినడంవల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

Written By: Swathi Chilukuri, Updated On : October 22, 2024 4:23 pm

There are many benefits of tomatoes.. and there are also negative ones..

Follow us on

tomatoes : టమాటలలోని విటమిన్ సి, లైకోపీన్ , డైటరీ ఫైబర్ కారణంగా క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడటంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. రక్తహీనత, ఉబ్బసం, రక్తపోటు, కొలెస్ట్రాల్, హనీడ్యూ వ్యాధులు ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. డైటింగ్ చేసే వారు టొమాటోలను డైలీ తినవచ్చు.  ఇక టొమాటో రసం సన్ బర్న్ , ఇతర చర్మ సమస్యల నుంచి రక్షించడానికి తోడ్పడుతుంది. పదార్ధం సౌందర్య సాధనాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేయడంలో కూడా సహాయపడుతుంది.

టమాటాల్లో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం, విరేచనాలను ఇవి నివారిస్తాయి. లుటిన్, లైకోపీన్ వంటి ప్రధానమైన కెరోటినాయిడ్లు టమాటాల్లో పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టమాటాలను మీ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.

టమాటాను ప్రతిరోజు తీసుకోవడంవల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. మాలిక్యులర్ క్యాన్సర్ రీసెర్చి జర్నల్ లో  ఒక అధ్యయనం వెలువడింది. దీని ప్రకారం ఇందులో ఉండే బీటాకెరోటిన్ తీసుకోవడంవల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ కణితిని పెరగనివ్వదట. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటంవల్ల రక్తపోటు పెరగదు. ఒక కప్పు చిన్న టమాటాలోనే ఏకంగా రెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు.

వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవడం అవసరమే. కానీ దీని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉండాలి అంటున్నారు  అవ్నీ కౌల్. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే టమోటాలు తక్కువగా తినాలట. గుండెల్లో మంటతో బాధపడేవారు కూడా వీటికి దూరంగా ఉండటమే బెటర్.

Tags