Site icon OkTelugu

North Korea Elections 2026: ఉత్తర కొరియా ఎన్నికలు.. కమ్యూనిస్టు రాజ్యంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇదీ

North Korea Elections 2026

North Korea Elections 2026

North Korea Elections 2026: ఉత్తరకొరియా పేరు చెప్పగానే నియంత జోంగ్‌ ఉన్‌ కిమ్‌. అధ్యక్షుడిగా ఆయన దశాబ్దాలుగా పాలన సాగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వారసులు ఎవరనేదానిపై కిమ్‌ కుటుంబంలో గొడవ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కిమ్‌ ఇరాన్‌ యుద్ధంలోకి వస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర కొరియాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇవి కఠిన కమ్యూనిస్టు వ్యవస్థకు పరిపూర్ణ ఉదాహరణ. 99.99% ఓట్లతో ఒకే పార్టీ విజయం సాధించింది. ఇక్కడ పోటీ లేదు. కానీ ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నికలు నిర్వహించారు.

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ vs దురంధర్ 2 లో హిట్ కొట్టిన మూవీ ఏంటంటే..?

ఎన్నికల ప్రక్రియ ఇలా..
ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ మాత్రమే పోటీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థులే నిలబడ్డారు. ప్రతి స్థానానికి ఒకే అభ్యర్థి. ఇది 1948 నుంచి కొనసాగుతోంది. పోలింగ్‌ రోజు ఓటర్లు బూత్‌లకు వెళ్లి బ్యాలెట్‌ పేపర్‌ తీసుకుంటారు. ఇష్టం లేకపోతే అధికారుల ముందు క్రాస్‌ చేసి వేయాలి లేదా ఖాళీగా ఇవ్వాలి. తాజా ఎన్నికల్లో 99.99 శాతం మంది ఓటు వేశారు. మిగిలిన 0.001 ఓటర్లు విదేశాల్లో ఉన్నారు. కొందరు పడవల్లో ప్రయాణిస్తున్నారు. మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు.

తిరస్కరిస్తే అంతే..
తమది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న కిమ్‌.. ఓటు వేయడంలో మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదు. ఖాళీ బ్యాలెట్‌ లేదా క్రాస్‌ లేకుండా వేస్తే తిరస్కరణగా లెక్కించబడుతుంది. కానీ ఇది అరుదు. ప్రజలు భయం, సామాజిక ఒత్తిడి వల్ల మద్దతు చూపిస్తారు. ఓటు వేయకపోతే ఉద్యోగం, సామాజిక స్థితి ప్రభావితమవుతాయి. ఈ విధానం కిమ్‌ ఇల్‌–సుంగ్‌ (1948) నుంచి మొదలైంది. కిమ్‌ జాంగ్‌–ఇల్, కిమ్‌ జాంగ్‌–ఉన్‌ పాలనలో కొనసాగుతోంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య రూపం కాదు, పాలకుల ఆధిపత్యాన్ని ధ్రువీకరించడం. ప్రచారం, భయం, ఆర్థిక ఆధారాలు కీలకం. ఇలాంటి వ్యవస్థలు క్యూబా, చైనాలో కొంత మార్పు కనిపిస్తుంది, కానీ ఉత్తర కొరియా అత్యంత కఠినం. ఫలితంగా, అధికార పార్టీ శాశ్వతంగా ఆధిపత్యం చెలాయిస్తుంది.

Exit mobile version