https://oktelugu.com/

Iran Vs Israel: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమైన ఇరాన్‌.. వార్నింగ్‌ ఇచ్చిన వైట్‌హౌస్‌!

పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్‌ చీఫ్‌ హత్య తర్వాత ఇటు హమాస్, అటు ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమవుతున్నాయి. ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 14, 2024 / 09:28 AM IST

    Iran Vs Israel

    Follow us on

    Iran Vs Israel: పశ్చిమాసియాలో ఇప్పటికే ఇజ్రాయెల్‌.. హమాస్‌తో యుద్ధం చేస్తోంది. హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యతో ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడైనా యుద్ధగా మారే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్‌ లేక దానికి మద్దతిస్తున్న సంస్థలు ఇజ్రాయెల్‌పై దాఆడిచేసే అవకాశం ఉంది. ఈమేరకు వైట్‌హౌస్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈ వారంలోనే దాడి జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. నిఘావర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ వైస్‌హౌస్‌ ప్రతినిధి జాన్‌ కిరబ్బీ ఈమేరకు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రతీకార దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉంది. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ను టెహ్రాన్ లో ఇజ్రాయెల్‌ సేనలు మట్టుపెట్టాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు ప్రతీకారం తప్పదని ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించింది. బీరుట్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో తమ అత్యంత సీనియర్‌ మిలటరీ కమాండర్‌ ఫాద్‌ షుక్ట్ర్‌ మృతిచెందాడని హెజ్‌బొల్లా వెల్లడించింది. హనియా హత్య ఇరాన్‌ గడ్డపై జరిగింది. దీంతో ఇరాన్, హమాస్, హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

    నివురుగప్పి నిప్పులా..
    ఇదిలా ఉంటే.. పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలు సంయుక్తగా ఓ ప్రకటన విడుదల చేశాఇ. కాస్త ఓర్పు వహించాలని ఇరాన్‌ను కోరాయి. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నాలకు మద్దతు ఇస్త ఆ ప్రకటన చేశాయి, సైనికపరమైన ఉద్రిక్తతలను నియంత్రించాలని బ్రిటన్‌ ప్రధాని, జర్మనీ ఛాన్స్‌లర్, ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిని సంప్రదించాయి. మరోవైపు ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న కాల్పుల విరమణ చర్చలు ఆగస్టు 15 నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌ దాడిచేస్తే చర్చలు ఆలస్యం అవుతాయని వైట్‌హౌస్‌ అభిప్రాయపడింది.

    హెజ్‌బొల్లా స్థావరాలపై దృష్టి..
    ఇదిలా ఉంటే.. హెజ్‌బొల్లా స్థావరాలున్న లెబనాన్‌పై ఎయిర్‌ పెట్రోలింగ్‌ చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ముప్పుగా భావిస్తోన్న లక్ష్యాలపై దాడులు చేస్తోంది. పరిస్థితుల తీవ్రతను గుర్తించిన అమెరికా పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని పంపుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గలాంట్‌తో ఆదివారం రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ రక్షణకు అగ్రరాజ్యం అమెరికా కట్టుబడి ఉందని ఆస్టిన్‌ తెలిపారు.