https://oktelugu.com/

NTR: లోకేష్ కనకరాజ్ ఎన్టీయార్ కాంబోలో సినిమా వచ్చేది ఎప్పుడంటే..?

మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరు క్యూ కడుతుందటం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి...ఇక మన స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా లో సూపర్ సక్సెసులను అందుకోవడం కూడా దానికి ఒక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : August 14, 2024 / 09:33 AM IST

    NTR

    Follow us on

    NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా వెలుగుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి విపరీతమైన గుర్తింపు అయితే లభించింది. ఇక దాంతో పాటుగా ఈ సినిమా మీద ఒక్కసారిగా హైప్ కూడా భారీగా పెరిగిందనే చెప్పాలి. సోలో హీరోగా మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా అంటూ తమ అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో ఒకసారిగా పాన్ ఇండియాలో తన సత్తా చూపించాడు. ఆ తర్వాత చేసిన లియో అంతగా ఆడకపోయినప్పటికీ తన మార్కు మాత్రం ఎక్కడా పోకుండా జాగ్రత్త పడ్డాడు…

    ఇక ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ అది ఎప్పుడు వర్క్ అవుట్ అవుతుంది అనే దాని మీదనే క్లారిటీ అయితే లేకుండా పోయింది. అయితే లోకేష్ గత కొన్ని రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడట…

    కానీ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు కమిట్ అవుతూ ఉండటం వల్ల లోకేష్ కనకరాజుకి మాత్రం సినిమా చేసే అవకాశం అయితే రావడం లేదు. నిజానికి లోకేష్ కనకరాజ్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తే అదొక భారీ సక్సెస్ గా నిలుస్తుందని ఎన్టీఆర్ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా లోకేష్ తో సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయనకి ఉన్న కమిట్ మెన్స్ వాళ్ల అది కుదరడం లేదు.

    ఇక తనకున్న కమిట్ మెంట్స్ మొత్తం పూర్తవడానికి కొంచెం టైమ్ పట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీటన్నింటిని పూర్తి చేసిన తర్వాత లోకేష్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటినుంచే వీళ్ళ కాంబినేషన్ మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది… చూడాలి మరి లోకేష్ ఎన్టీయార్ ను ఎలాంటి పాత్రలో చూపిస్తాడు అనేది…