Homeఅంతర్జాతీయంIran Plot To Assassinate Donald Trump: ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ మాస్టర్‌ ప్లాన్‌.. తృటిలో...

Iran Plot To Assassinate Donald Trump: ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ మాస్టర్‌ ప్లాన్‌.. తృటిలో తప్పించుకున్న అగ్రరాజ్యాధినేత

Iran Plot To Assassinate Donald Trump: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఇరాన్‌లో రెజీమ్‌ చేంజ్‌ లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధం మొదలు పెట్టింది. ఇందులో మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని మట్టు పెట్టింది. ఇందుకోసం ఇరాన్‌కు చెందిన ఇన్‌ఫార్మర్‌ను ఉపయోగించుకుంది. పక్కాప్లాన్‌తో ఖమేనీ కథ ముగించింది. అయితే ఖమేనీ 2024లోనే ట్రంప్‌ హత్యకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. కానీ అది విఫలమైంది. ఈ విషయం ఆలస్యంగా అది […]

Iran Plot To Assassinate Donald Trump: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఇరాన్‌లో రెజీమ్‌ చేంజ్‌ లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధం మొదలు పెట్టింది. ఇందులో మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని మట్టు పెట్టింది. ఇందుకోసం ఇరాన్‌కు చెందిన ఇన్‌ఫార్మర్‌ను ఉపయోగించుకుంది. పక్కాప్లాన్‌తో ఖమేనీ కథ ముగించింది. అయితే ఖమేనీ 2024లోనే ట్రంప్‌ హత్యకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. కానీ అది విఫలమైంది. ఈ విషయం ఆలస్యంగా అది వెలుగులోకి వచ్చింది.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

పాకిస్తాన్‌ గూడచారి ప్రయోగం..
పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్‌ మెర్చెంట్‌ అనే వ్యక్తిని ఇరాన్‌ గూఢచార ఏజెంట్లు ఉపయోగించి అమెరికాలో రహస్య చర్యలు చేపట్టారు. 2024 ఎన్నికల సమయంలో ట్రంప్‌ హత్యకు ప్లాన్‌ చేసింది. ఆసిఫ్‌ మర్చెంట్‌ మాస్క్‌ ధరించి అమెరికాకు చేరుకుని, ట్రంప్‌తో ాటు బైడెన్, నిక్కీ హేలీలపై దాడి ప్రణాళికలు రచించాడు. హోటల్‌ నాప్‌కిన్‌పై లక్ష్యాలు, రక్షణలు గుర్తించి, డబ్బు చెల్లించి కిల్లర్లతో మాట్లాడినట్లు కోర్టు డాక్యుమెంట్లు తెలియజేశాయి.

ఎఫ్‌బీఐకి పట్టుబడి..
ఫెడరల్‌ ఏజెంట్లు ముందస్తు సమాచారం పొంది ఆసిఫ్‌తో సంప్రదించిన వ్యక్తి రహస్య సమాచారం అందించాడు. జూలై 12న ఆసిఫ్‌ అరెస్ట్‌ అయ్యాడు, అతడు రూ.5,000 ముందస్తు చెల్లించి బయటపడాలనుకున్న సమయంలో. విచారణలో ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) ఆదేశాలు ఉన్నాయని, తన కుటుంబ భద్రత కోసం చేశానని ఒప్పుకున్నాడు. ఇది సోలెమానీ హత్య తర్వాత ఇరాన్‌ ప్రతీకార చర్యలో భాగమని భావిస్తున్నారు.

గతంలో కూడా ప్రయత్నం..
ఇరాన్‌ ఐఆర్‌జీసీ ద్వారా ట్రంప్‌పై గతంలో కూడా దాడులు ప్రణాళికాబద్ధం చేసింది. 2024 సెప్టెంబర్‌లో మరో ఏజెంట్‌కు ఆదేశాలు జారీ చేసి, ఎన్నికల తర్వాత సులభంగా చంపవచ్చని చెప్పారట. ఈ ప్రయత్నం ఫలించకముందే అడ్డుకున్నారు. ఆసిఫ్‌ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

ఈ సంఘటన ఇరాన్‌–అమెరికా శత్రుత్వాన్ని మరింత ఊపందుకునేలా చేస్తుంది. పాకిస్తాన్‌ వంటి దేశాల నుంచి ఏజెంట్లను ఉపయోగించడం గూఢచార యుద్ధానికి కొత్త అధ్యాయం. ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు, సైనిక చర్యలు పెంచవచ్చు. ఇది మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదం, ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper