Vijay Deverakonda Rashmika Wedding Reception: నిన్న హైదరాబాద్ లో జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని , నవీన్ పోలిశెట్టి వీడియో ఒకటి వివాదాలకు దారి తీస్తోంది. నాని వెడ్డింగ్ రిసెప్షన్ కి రాగానే నవీన్ పోలిశెట్టి పరుగులు తీసుకుంటూ ముందుకు వచ్చి హగ్ ఇవ్వడం. కానీ ఆ తర్వాత నాని ని నవీన్ పోలిశెట్టి రిసీవ్ చేసుకున్న విధానం అసలు బాగాలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రెండు మూడు హిట్లు పడగానే అంత యాటిట్యూడ్ అవసరం లేదంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్. ఇంతకీ అంతలా అసలు అక్కడ ఏమైంది , ఎందుకు నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
నవీన్ పోలిశెట్టి నాని ని హగ్ చేసుకుంటూ ‘ఒక్క హగ్గు ‘ అని అంటాడు. అప్పుడు నాని ఇందాకే కదా ఇచ్చాను అని అంటాడు. ఆ తర్వాత డయాస్ మీదకు రావాల్సిందిగా నవీన్ పోలిశెట్టి నాని చెయ్యి పట్టుకొని పైకి లాగుతాడు. అప్పుడు నాని నవీన్ చెయ్యి పై కొడుతూ ‘ఏంటయ్యా నువ్వు ‘ అనే అర్థం వచ్చేలా చెయ్యి చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ సమయం లో నాని సతీమణి ప్రశాంతి రెడ్డి వెనక్కి తిరిగి నవీన్ పోలిశెట్టి కి హాయ్ చెప్తుంది. అప్పుడు నవీన్ పోలిశెట్టి ఆమె వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తాడు. నాని ఆమెని ఇక చాలు పదా అన్నట్టు ఆమెని తీసుకొని ముందుకెళ్లాడు. ఎప్పుడూ లేని విధంగా నాని ఎందుకు ఇలా ప్రవర్తించాడు ?, ఆయన నేచర్ ఇది కాదే , చాలా మంచోడే అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
నాని ఎలా అయితే బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడో, నవీన్ పోలిశెట్టి కూడా అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదింన్చుకున్నాడు. ఇలాంటి వాళ్ళని నాని వంటి వారు ప్రోత్సహించాలి, దగ్గరకు తీయాలి, కానీ ఇలా ప్రవర్తించడం ఏంటి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాని అక్కడ అంత హడావడిగా పరుగులు తీయడానికి కారణం అభిమానులు అక్కడ ఉండడం వల్లే అని తెలుస్తోంది. చాలా మంది ‘నాని అన్నా’ అని అరుస్తున్నారు. అక్కడే ఉంటే పెద్ద హడావుడి అవుతుందని నాని అలా చేశాడంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.