Homeఅంతర్జాతీయంDonald Trump Iran Nuclear Deal 2026: ఇరాన్‌పై ఇక ‘అణు’మానం లేదు.. ట్రంప్‌ కీలక...

Donald Trump Iran Nuclear Deal 2026: ఇరాన్‌పై ఇక ‘అణు’మానం లేదు.. ట్రంప్‌ కీలక ప్రకటన!

Donald Trump Iran Nuclear Deal 2026: అగ్రరాజ్యాధినేత పశ్చిమాసియాలో రాజేసిన నిప్పు సెగ అమెరికాకే తాకుతోంది. వారం పది రోజుల్లో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని భావించిన డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌ తగిలింది. 24 రోజులుగా ఇరాన్‌ యుద్ధం కొనసాగిస్తోంది. ప్రతీకార దాడులతో అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. అతిపెద్ద సైనిక శక్తి కలిగిన అమెరికాకు చుక్కటు చూపిస్తోంది. దీంతో ట్రంప్‌ యుద్ధంపై వెనకు తగ్గాడు. ఐదు రోజులు విరామం ప్రకటించాడు. తాజాగా ఆయన వ్యాఖ్యలు పరిశీలిస్తే యుద్ధం పూర్తిగా ముగించే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపై ఇరాన్‌ అణు బాంబు తయారు చేయదని మాకు నమ్మకం కలిగింది. ఈమేరకు ఇరాన్‌తో డీల్‌ కుదిరింది అని ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఇరాన్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్

ట్రంప్‌ ప్రకటనలో వాస్తవం ఉందా?
హార్మూజ్‌ జలసంధిని 48 గంటల్లో ఓపెన్‌ చేయకపోతే.. ఇరాన్‌ విద్యుత్‌ సంస్తలపై దాడులు చేస్తామని ట్రంప్‌ డెడ్‌లైన్‌ పెట్టారు. అయితే 24 గంటలు గడిచాక.. యుద్ధం ఐదు రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత దౌత్య చర్చల్లో ఇరాన్‌ అణు ఆయుధాల తయారీ ఆపేస్తుందని ట్రంప్‌ ధీమాగా ప్రకటించడం గత సైనిక దాడుల తర్వాత వచ్చిన మలుపుగా కనిపిస్తోంది. ఒమాన్, జెనీవాలో పరోక్ష చర్చలు జరిగిన నేపథ్యంలో ఇరాన్‌ ఉప విదేశాంగ మంత్రి అణు కార్యక్రమాన్ని రద్దు చేయడానికి సిద్ధమని సూచించాడు. అయితే ఇది గౌరవప్రదమైన ఆఫర్‌పై ఆధారపడి ఉంది,

గత సందర్భాల విఫలం..
2015 అణు ఒప్పందం ఇరాన్‌ను తాత్కాలికంగా మేల్కొల్పినా, ట్రంప్‌ 2018లో దాన్ని ఉపసంహరించడంతో ఇరాన్‌ యురేనియం సుసంపన్నతను పెంచుకుంది. అమెరికా దాడులు కూడా అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయలేదని ఇంటెలిజెన్స్‌ నివేదికలు సూచిస్తున్నాయి. ఇటువంటి శత్రుత్వం, పరస్పర అనుమానాలు కొత్త ఒప్పందాలను బలహీనపరుస్తాయి.

ఇరాన్‌ నిలకడగా ఒప్పుకుంటుందా?
ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేస్తుందని« ధ్రువీకరించడం కష్టం. ఎందుకంటే వారు దానిని ‘పౌర శక్తి‘గా చెబుతూ కొనసాగిస్తున్నారు. ట్రంప్‌ హెచ్చరికలు ప్రభావం చూపుతున్నాయి, కానీ యురేనియం నిల్వలు సురక్షితంగా ఉన్నాయని, కార్యక్రమం కొనసాగుతుందని నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో పునరావృతమైన ఉల్లంఘనలు జరిగే అవకాశం ఎక్కువ.

ఈ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్య యుద్ధ మేఘాలు తగ్గుతాయి, అణు వ్యాప్తి నిరోధకత పెరుగుతుంది. కానీ ఇరాన్‌ మళ్లీ మార్గం మలిచితే అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని ట్రంప్‌ స్పష్టం చేయడం ఒత్తిడిని కొనసాగిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper