https://oktelugu.com/

Israel: చుట్టూ శత్రు దేశాలు.. ఐనా ఇజ్రాయిల్ భయపడదు.. ఎందుకంటే..

చుట్టూ శత్రు దేశాలు..వాటికి ప్రపంచ దేశాల అండదండలు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య ఆ దేశం తనను తను కాపాడుకుంటున్నది. దశాబ్దాలుగా శత్రు దేశాల ఎత్తులను చిత్తు చేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 25, 2024 / 09:09 PM IST

    Israel(1)

    Follow us on

    Israel: పై ప్రస్తావన ఏ అమెరికా గురించో.. లేక జపాన్ గురించో కాదు.. పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన ఇజ్రాయిల్ దేశం గురించి. ఇజ్రాయిల్ పేరు ప్రస్థావనకు రాగానే ఐరన్ డోమ్ గుర్తుకు వస్తుంది. ఇజ్రాయిల్ దేశం తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న అత్యంత ఆధునికమైన రక్షణ వ్యవస్థ ఇది. ఒకరకంగా ఇది ఉక్కు కవచం లాగా ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటుంది. దాడులను ధైర్యంగా అడ్డుకుంటుంది. ఆకాశం నుంచి క్షిపణులను ప్రయోగించినా వీసమెత్తు నష్టం వాటిల్లదు. పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.. అయితే ఇందులో యారో -2, యారో -3 వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటాయి. అంతరిక్షంలోనే వాటిని పేల్చేసి.. వాటి శకలాలు కూడా దూరంగా పడేలా చేస్తాయి.

    ఇక ఈ రక్షణ వ్యవస్థలో డేవిడ్ స్ట్రింగ్ అనేది మిడిల్ డిఫెన్స్ సిస్టం గా పనిచేస్తుంది.. 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిష్టిక్ క్షిపణులను ఇది ఎదుర్కొంటుంది. యుద్ధ విమానాలను, డ్రోన్లను ఇది నేలమట్టం చేస్తుంది. దీనికి చిట్ట చివరిలో ఐరన్ డోమ్ అనే వ్యవస్థ ఉంటుంది. దీనిని ఇజ్రాయిల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్ బొల్లా వేలాది రాకెట్లను ప్రయోగించగా.. ఐరన్ డోన్ పడగొట్టింది. ఇజ్రాయిల్ దేశానికి అద్భుతమైన రక్షణ వ్యవస్థగా నిలిచింది..

    ఐరన్ డోమ్ ను ఇజ్రాయిల్ పరిభాషలో “కిప్పాట్ బర్జెల్” అని పిలుస్తుంటారు. ఇది స్వల్ప శ్రేణి ఆయుధాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇందులో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ వంటి విభాగాలు ఉంటాయి. రాడార్ అనేది దూసుకు వస్తున్న ఆయుధాలను పసిగడుతుంది. అవి నేలను తాకే స్థితిని అంచనా వేస్తుంది. అక్కడ ఒకవేళ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే వదిలిపెడుతుంది. ఒకవేళ జనావాసాలు మాత్రం ఉంటే రాకెట్ ప్రయోగిస్తుంది. వెంటనే ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టం, రఫెల్ వంటి సంస్థలు పనిచేశాయి.. దూసుకు వచ్చే రాకెట్లను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ తమార్ క్షిపణులను వాడుతుంది. ఇందులో ఎలక్ట్రో ఆస్తిక్ సెన్సార్లు, మల్టిపుల్ స్టీరింగ్ ఫిన్స్ ఉంటాయి. ఇక ప్రతి ఐరన్ డోన్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు కచ్చితంగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 10 సెకండ్ల వ్యవధిలో పది క్షిపణులను ప్రయోగిస్తాయి. ఇంతటి వ్యవస్థ ఉంది కాబట్టే ఇజ్రాయిల్ దేశం తనను తాను కాపాడుకుంటున్నది. శత్రు దేశాల ఎత్తులను చిత్తులు చేస్తోంది.. అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకొని.. డిఫెన్స్ విభాగంలో అమెరికా, రష్యా దేశాల స్థాయిలో బలమైన శక్తిగా ఎదిగింది.