https://oktelugu.com/

Sathyam Sundaram First Review: హీరో కార్తీ ‘సత్యం సుందరం’ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది..ఈ రేంజ్ లో ఉంటే ‘దేవర’ కి కష్టమే!

కార్తీ నుండి ఈ నెల 28 వ తారీఖున 'సత్యం సుందరం' అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం విడుదల అవుతున్న సమయంలో రిలీజ్ అవుతుంది, ఆ మేనియా లో ఈ చిత్రాన్ని ఎవరు పట్టించుకుంటారు అని ట్రేడ్ పండితులు సైతం అనుకునేవారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 09:14 PM IST

    Sathyam Sundaram First Review

    Follow us on

    Sathyam Sundaram First Review: తమిళం లో మన తెలుగు ఆడియన్స్ అమితంగా ఇష్టపడే హీరోలలో ఒకరు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కార్తీ, తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాదు తమిళ హీరోలలో తెలుగు భాషపై ఎక్కువ ప్రేమ చూపించేది కూడా కార్తీ నే. తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఎంతో గొప్పోళ్ళు అంటూ ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బహిరంగంగా చెప్పాడు. అందుకే కార్తీ ని తెలుగు ఆడియన్స్ తమిళ హీరో లాగా చూడరు, తెలుగు హీరోలాగానే చూస్తారు. అలాంటి కార్తీ నుండి ఈ నెల 28 వ తారీఖున ‘సత్యం సుందరం’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం విడుదల అవుతున్న సమయంలో రిలీజ్ అవుతుంది, ఆ మేనియా లో ఈ చిత్రాన్ని ఎవరు పట్టించుకుంటారు అని ట్రేడ్ పండితులు సైతం అనుకునేవారు.

    కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో టాక్ చూసిన తర్వాత ఈ చిత్రం థియేట్రికల్ రన్ ప్రభావం ‘దేవర’ పై పడే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. ట్రైలర్ ని చూస్తేనే మీ అందరికీ అర్థం అయిపోతుంది. ఇది కమర్షియల్ సినిమా కాదు, పాటలు, ఫైట్స్ వంటివి ఉండవు. కేవలం కార్తీ, అరవింద్ స్వామి మధ్య జరిగే కథ మాత్రమే అని. ఈ చిత్రం లో వీళ్లిద్దరు బావ బావమర్థులుగా నటించారు. సినిమా కథ మొత్తం వీళ్లిద్దరి మధ్యనే ఉంటుంది. కార్తీ ‘ఖైదీ’ చిత్రం లాగానే, ఈ సినిమా కూడా ఎక్కువ శాతం రాత్రి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించారట. ఈ చిత్రం లో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవ దర్శిని వంటి పెద్ద ఆర్టిస్ట్స్ నటించారు కానీ, కథ మొత్తం వీళ్లిద్దరి ఎక్కువ సేపు కనిపిస్తారట. వీళ్లిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, సెంటిమెంటల్ సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయని, ముఖ్యంగా కొన్ని సన్నివేశాలకు అయితే ఏడవని మనిషి ఉండరని, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, అనేక అవార్డులను కూడా తెచ్చి పెట్టే సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

    మన తెలుగు ఆడియన్స్ ఎలాంటి పరిస్థితి లో అయిన బాగున్న సినిమాని నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు, ఈ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారు అనే నమ్మకం ఉండడం వల్లే ‘దేవర’ చిత్రం విడుదల అవుతున్నప్పటికీ కూడా ధైర్యం గా విడుదల చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కార్తీ గత చిత్రం ‘జపాన్’ భారీ అంచనాల నడుమ విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అందుకే ఆయన ఈసారి ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంతో మన ముందుకి రాబోతున్నాడు. మరి ‘దేవర’ ధాటిని తట్టుకొని ఈ సినిమా ఎంత వరకు నెట్టుకొస్తుందో చూడాలి.