Sobhita Dhulipala: సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఎప్పటి నుండో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి కానీ, అవి కేవలం రూమర్స్ అని అందరూ అనుకున్నారు. కానీ రేపు నిశ్చితార్థం అనగా, ఈరోజు అభిమానులకు ప్రకటించి గుట్టు చప్పుడు కాకుండా చేసుకున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు ఇరు కుటుంబాలకు సంబంధించిన వారు మాత్రమే హాజరు అయ్యారు కానీ, ఇండస్ట్రీ నుండి ఎవరూ రాలేదు. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. డిసెంబర్ నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే శోభిత ఇటీవలే బాలీవుడ్ లో ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా నాగ చైతన్య తో జరిగిన నిశ్చితార్థం గురించి మాట్లాడుతూ ‘నాకు మొదటి నుండి నిశ్చితార్థం పెద్ద హంగు, ఆర్భాటాలతో జరగాలని కోరుకోలేదు, కానీ నా నిశ్చితార్థం చాలా సాధారణంగా జరిగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు, నా తల్లిదండ్రులు తెలుగు సంప్రదాయాలను తూచా తప్పకుండ అనుసరిస్తారు. నాకు కూడా వాళ్ళు చిన్నప్పటి నుండి అవే నేర్పించారు. నేను తెలుగు సంప్రదాయాలకు తగ్గట్టుగా నా నిశ్చితార్థం జరిగితే చాలు అని కోరుకున్నాను. అదే విధంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షం లో జరగడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అందుకే నేను మా ఇద్దరి నిశ్చితార్థం చాలా సాధారణంగా జరిగింది అంటే ఒప్పుకోను’ అని చెప్పుకొచ్చింది శోభిత దూళిపాళ్ల. శోభిత దూళిపాళ్ల అచ్చతెలుగు అమ్మాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. తెనాలి లో పుట్టి పెరిగింది. మోడలింగ్ మీద ఆసక్తి తో తన కెరీర్ ని మొదలు పెట్టిన శోభిత 2013 వ సంవత్సరం కి గాను ఫెమినా మిస్ ఇండియా పోటీలలో టైటిల్ విన్నర్ గా నిలిచారు.
ఆ తర్వాత 2016 వ సంవత్సరం లో శోభిత వెండితెర అరంగేట్రం చేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకుంది. తెలుగు లో ఈమె అడవి శేష్ నటించిన ‘మేజర్’, ‘గూఢచారి’ చిత్రాల్లో నటించింది. సాధారణంగా కలిసి ఒకే సినిమాలో పని చేసిన వాళ్ళు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ శోభిత, నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరకు కలిసి ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం వీళ్లిద్దరు కలిసి ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునే రేంజ్ కి ఎలా వచ్చారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్ననే.